Kaun Banega Crorepatiలో రూ. 5 కోట్లు గెలుచుకున్న వ్యక్తి పాలు అమ్ముకుంటున్నాడు

Kaun Banega Crorepati లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఇంకా గుర్తుండే ఉంటుంది కదా. ఆ వ్యక్తి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బులను కాపాడుకోవడంలో పాపం విఫలం చెందాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పాడు.
రూ. 5 కోట్లు గెలుకున్న అనంతరం సెలబ్రెటీని అయ్యానని, బీహార్ రాష్ట్రంలో జరిగిన పలు కార్యక్రమాలకు తనను పిలవడం జరిగిందన్నారు. వచ్చిన డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టానన్నారు. వెంచర్లు చాలా వరకు నష్టం కలిగించినట్లు, స్వచ్చం సంస్థలకు ప్రతి నెలా రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అయితే..ఇక్కడ కొంతమంది మోసం చేశారని, తన భార్యతో ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. స్నేహితుడి సాయంతో ఢిల్లీలో కొన్ని కార్లను అద్దెకు తీసుకున్నాడు. దీంతో ఢిల్లీకి క్రమం తప్పకుండా వెళ్లాల్సి వచ్చేది. విద్యార్థి సంఘాలతో పరిచయం ఏర్పడడం, వ్యసనాలకు అలవాటు పడడం జరిగింది.
2016లో మద్యం సేవించినట్లు, గత సంవత్సరమే సిగరేట్లు పీల్చడం మానేసినట్లు చెప్పాడు. సినిమాలు చూసి డైరెక్టర్ అవుదామని అనుకున్నాడు. కానీ ఇక్కడ మోసం జరిగింది. ఓ సారి..గదిలో ప్యాస సినిమా చూస్తున్నాడు. అదే సమయంలో భార్య రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఒక నెల పాటు ఇద్దరి మధ్య మాటలు లేవు.
టీవీ సీరియల్స్ నటించాలని అనుకున్నట్లు..కొన్ని రోజులకు దానిని విడిచిపెట్టినట్లు తెలిపాడు. ఈ క్రమంలో ప్రస్తుతం రెండు ఆవులను కొని..పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది దూరంగా ఉన్నారని వాపోయాడు.
Kaun Banega Crorepati లో హోస్ట్ గా చేసిన అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు ఠకఠకా సమాధానం చెప్పి..అందర్నీ ఆశ్చర్యపరుస్తూ..రూ. 5 కోట్లు గెలుచుకున్నాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇతను ఐఏఎస్ కావాలని అనుకున్నాడు.