కేరళకు చెందిన ఓ 24ఏళ్ళ ఆలయ ఉద్యోగి అనంతు విజయన్ తిరువొన్నం బంపర్ లాటరీ విజేతగా నిలిచి రూ. 12కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. దీంతో ప్రస్తుతం కొచ్చి లోని ఓ ఆలయంలో ఉద్యోగం చేస్తున్న అనంతు విజయన్.. ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యాడు., లాటరీలో గెలుపొందినందకు ట్యాక్స్ కట్టింపు మినహాయించి అతని చేతికి రూ. 7.56 కోట్లు అందనున్నాయి. అతనికి టికెట్ అమ్మిన కందవంద్రలోని లాటరీ అమ్మకపుదారుడికి.. రూ. 1.20 కోట్ల కమిషన్ దక్కనుంది
విజయన్ స్వస్థలం కేరళలోని ఇడుక్కికి సమీపంలోని తోవాల. అతడి తండ్రి పెయింటర్‌గా ఉన్నాడు. అమ్మ ఇంటిపనులు చూసుకుంటూ ఉంటుంది. విజయన్ తమ్ముడు బీబీఏ పూర్తి చేసి ఎంబీఏ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పీజీ పూర్తి చేసి.. ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్న అతడి అక్క.. లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయింది. ఈ క్రమంలో లాక్‌డౌన్ నుంచి కటుంబపోషణ మొత్తం విజయన్ మీదనే పడింది. అయితే ఆ సమయంలోనే విజయన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు.
అనుకున్నదే పనిగా TB 173964 నెంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. లాటరీ రిజల్ట్ ప్రకటించే రోజు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు అతను తన టికెట్ బయటకు తీసి ఆ నంబర్.. రిజల్ట్‌తో మ్యాచ్ అవుతుందా లేదా అని చూశాడు. అయితే తను ఫ్రైజ్ మనీ గెలుచుకున్నట్టు తేలడంతో ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యాడు.
దీనిపై విజయన్ స్పందిస్తూ.. నేను ఈ విషయాన్ని మొదట నా తల్లిదండ్రులకు చెప్పాను.. వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. ఈ ఉత్సహాన్ని ఆపడానికి నాకు చాలా గంటలు పట్టింది. నేను కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయాను అని తెలిపాడు.