కేరళ వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా

దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్​కు కరోనా సోకింది. మంగ‌ళ‌వారం చేయించుకున్న‌ ప‌రీక్షలో ఆయనకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది.


మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్ తో పాటు ఆయన గన్​మెన్​కు కూడా వైరస్​ సోకింది. మంత్రితో పాటు ఆయన సిబ్బందిని స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు డాక్టర్లు.

కాగా, కేరళ కేబినెట్​లో వైరస్​ బారిన పడిన మూడో మంత్రి సునీల్​ కుమార్​. అంతకు ముందు పరిశ్రమలు, క్రీడల శాఖ మంత్రి ఈపీ జయరాజన్​, ఆర్థిక మంత్రి థామస్​ ఇసాక్​కు మహమ్మారి ​ సోకింది.

.