Kerala Bomb Blast : ఢిల్లీ, ముంబయితోపాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్
కేరళ పేలుళ్ల ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కేరళలోని ఎర్నాకులంలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మూడు పేలుళ్లు సంభవించాయి....

Delhi High Alert
Kerala Bomb Blast : కేరళ పేలుళ్ల ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కేరళలోని ఎర్నాకులంలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మూడు పేలుళ్లు సంభవించాయి. కేరళలో ప్రార్థనా సమావేశంలో ప్రత్యేక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుళ్లు జరిగాయి. కేరళలో పేలుళ్లు జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో పాలస్తీనాకు మద్దతుగా సీపీఎం నేతలతో కలిసి ధర్నాకు కూర్చున్నారు.
Also Read : Plane crash : బ్రెజిల్ దేశంలో కూలిన విమానం…12 మంది మృతి
కేరళలోని కలమసేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య సోమవారం నాటికి మూడుకు పెరిగింది. ఆదివారం క్రిస్టియన్ మతపరమైన సమావేశంలో జరిగిన పేలుడులో 50 మందికి పైగా గాయపడిన 12 ఏళ్ల బాలిక కలమసేరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించింది. పేలుళ్లకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ను ఉపయోగించినట్లు కేరళ పోలీసులు తెలిపారు.
Also Read : Vizianagaram Train Accident : 14కు చేరిన మృతుల సంఖ్య,100 మందికి పైగా గాయాలు,12 రైళ్లు రద్దు
పేలుడు పదార్థాలను టిఫిన్ బాక్స్‌లో ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేరళ పేలుడు తరువాత, ఢిల్లీ-ముంబయి నగరాలతో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముంబై వరల్డ్ కప్ విషయంలో అలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలోని పలు చర్చిల్లో భద్రతను పెంచారు.
Also Read : Vizianagaram Train Accident : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య
కేరళ పేలుళ్లపై ముఖ్యమంత్రి నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నారు. ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. శుక్రవారం కేరళలోని మలప్పురంలో పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.