Sabarimala Temple : శబరిమలకు చిన్నారులు వెళ్లొచ్చు.. కోవిడ్ టెస్టు రిపోర్టు అక్కర్లేదు!

శబరిమల దర్శనానికి వెళ్లే చిన్నారుల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేరళ ప్రభుత్వం తెరదించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే చిన్నపిల్లలకు కోవిడ్ టెస్టు రిపోర్టు అక్కర్లేదని తెలిపింది.

Sabarimala Temple : శబరిమల దర్శనానికి వెళ్లే చిన్నారుల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేరళ ప్రభుత్వం తెరదించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే చిన్నపిల్లలకు కోవిడ్ టెస్టు రిపోర్టు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శబరిమలలోకి ప్రవేశించేందుకు చిన్నారులకు ఆర్టీపీసీఆర్ (RT-PCR) టెస్టు తప్పనిసరి కాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. పిల్లలతో పాటు వెంట వచ్చే పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అయితే కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. RT-PCR లేకుండానే చిన్నారులను దర్శనానికి అనుమతించాలనే నిర్ణయం తీసుకుందని కేరళ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. పిల్లలతో పాటు వచ్చే పెద్దలు.. సబ్బు, శానిటైజర్, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించాలని సూచించింది. పిల్లల ఆరోగ్య సమస్యలకు పెద్దలు జవాబుదారీగా ఉంటారని ఉత్తర్వుల్లో తెలిపింది.

శబరిమల మకరవిళక్కు పండుగ 2021-22 సజావుగా సాగడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ నియంత్రణపై రాష్ట్ర ప్రోటోకాల్‌కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. శబరిమలకు వచ్చే యాత్రికులు, సిబ్బందికి తప్పనిసరిగా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా 72 గంటల ముందు RT-PCR నెగెటివ్ రిపోర్ట్ చూపించాలని తెలిపింది. అయితే కేంద్రం ఉత్తర్వుల్లో పిల్లలపై ప్రస్తావించలేదు. అప్పటినుంచి శబరిమల యాత్రకు వచ్చే పిల్లల విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పుడు కేరళ ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో స్పష్టత వచ్చింది.

గతవారమే పత్నామ్ మిట్టా జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంబా నది పోటెత్తింది. నదిలో నీటి మట్టం పెరిగిపోయింది.  శబరిమల యాత్రను జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. అనంతరం రెడ్ అలర్ట్ ప్రకటించింది. కక్కి-అనాథోడే రిజర్వాయర్, పంబా డ్యామ్ గేట్లను ఎత్తివేసినట్టు జిల్లా కలెక్టర్ దివ్యా అయ్యర్  తెలిపారు.

Read Also : Lecturer Beats Students : హోంవర్క్ చేయలేదని.. పైపులు, అట్టలతో విద్యార్థులను చితకబాదిన లెక్చరర్

ట్రెండింగ్ వార్తలు