Lecturer Beats Students : హోంవర్క్ చేయలేదని.. పైపులు, అట్టలతో విద్యార్థులను చితకబాదిన లెక్చరర్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాలేజీలో లెక్చరర్ అరాచకం సృష్టించాడు. పీవీసీ పైపులు, అట్టలతో విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. హోంవర్క్ చేయలేదనే కారణంతో..

Lecturer Beats Students : హోంవర్క్ చేయలేదని.. పైపులు, అట్టలతో విద్యార్థులను చితకబాదిన లెక్చరర్

Lecturer Beats Students

Lecturer Beats Students : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చైతన్య కాలేజీలో లెక్చరర్ అరాచకం సృష్టించాడు. పీవీసీ పైపులు, అట్టలతో విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఇంటర్ విద్యార్థులను ఓ లెక్చరర్ చితకబాదాడు. గొడ్డుని బాదినట్టు బాదాడు. విద్యార్థులను లెక్చరర్ కొడుతున్న దృశ్యాలను వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు

విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు లెక్చరర్ తీరుపై సీరియస్ అయ్యారు. శ్రీ చైతన్య కాలేజీ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. చిన్న కారణంతో విద్యార్థులను గొడ్డుని బాదినట్టు బాదిన లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు.

Microsoft Free Trick : ఈ ట్రిక్‌తో MS Office సాఫ్ట్‌వేర్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

విద్యార్థులకు బోధన చేసే గురువుకి ఎంతో ఓపిక, సహనం ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కంట్రోల్ లో ఉండాలి. విద్యార్థులు మాట వినకపోతే నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. మాట వినకపోతే ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేయాలి. అంతేకానీ, ఇలా కోపంతో ఊగిపోతూ పైపులతో విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదడం కరెక్ట్ కాదని విద్యార్థి సంఘం నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.