959 Deaths In A Day As Kera
Kerala Covid Cases : కేరళలో కరోనా విలయం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత డేటాతో కలిపి రాష్ట్రంలో ఒక్కరోజులోనే 959 కరోనా మరణాలు నమోదయ్యాయి. కేరళలో కొత్తగా 51,570 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మరో 14 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. శనివారంతో 50,812 కేసులతో పోలిస్తే.. ఆదివారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. దాంతో కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60లక్షలకు చేరింది.
సుప్రీం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలతో మరో 374 మరణాలను కేరళ గుర్తించింది. దీంతో రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజు డేటాలో 959 కరోనా మరణాలు నమోదయ్యాయి. కేరళలో 959 కోవిడ్ సంబంధిత మరణాలతో కలిపి (ఈరోజు లెక్కలో 374 పాత మరణాలు) మొత్తంగా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4,95,050కి చేరుకుంది. కేరళలో కొత్తగా 374 మరణాలను డేటాలో చేర్చింది. గత 24 గంటల్లో 2,62,628 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.
దేశంలో కొత్తగా 2.09 లక్షల కరోనా కేసులు
దేశంలో సోమవారం (జనవరి 31) కొత్తగా 2.09 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోలిస్తే.. 10శాతం తక్కువగా నమోదయ్యాయి . పాజిటివిటీ రేటు 14.5శాతం నుంచి 15.7శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,268గా నమోదైంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు ప్రస్తుతానికి 18,31,268కు చేరాయి. మొత్తం కరోనా కేసుల్లో 4.43శాతంగా నమోదైంది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 94.37శాతంగా ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,31,198 కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. భారత్ డిసెంబర్ 19, 2020న కేసుల్లో కోటి మార్కును అధిగమించింది. మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్ల మైలురాయిని అధిగమించింది. భారత్‌లో ఇప్పటివరకు 166.03 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించింది. 15-18 ఏళ్ల వయస్సు వారంతా ఈ రోజు నుంచి రెండో డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకోనున్నారు.
కోవాక్సిన్ 15-18 ఏళ్ల వయస్సు వారికి అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజు 6.37శాతం పాజిటివ్ రేటుతో కొత్తగా 3,674 కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరి 13న రికార్డు స్థాయిలో 28,867కి కరోనా కేసులు చేరిన తర్వాత ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక మహారాష్ట్రలో ఆదివారం 22,444 కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 77,05,969 కు పెరిగింది.
Read Also : Parliament Budget Session 2022 : రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు