కేరళ అసెంబ్లీ : నాకిష్టం లేదు..CM చదవమంటేనే చదివాను : గవర్నర్ ఆరిఫ్ మహ్మద్

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 06:28 AM IST
కేరళ అసెంబ్లీ : నాకిష్టం లేదు..CM చదవమంటేనే చదివాను : గవర్నర్ ఆరిఫ్ మహ్మద్

Updated On : January 29, 2020 / 6:28 AM IST

కేరళ అసెంబ్లీలో బుధవారం (జనవరి 29,2020) ఉదయం హైడ్రామా నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తన ప్రసంగాన్ని చదివి వినిపించేందుకు సీఎంతో కలిసి అసెంబ్లీలోకి వస్తున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. 

గవర్నర్ పోడియం వద్దకు చేరుకునే క్రమంలో పోడియం వద్దకు వెళ్లే మార్గానికి అడ్డుగా నిలబడ్డారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఏఏను గవర్నర్ సమర్థించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘యాంటీ సీఏఏ’ ప్లకార్డులు పట్టుకుని ‘గవర్నర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేరళ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
 
దీంతో భద్రతా సిబ్బంది సాయంతో పోడియం వద్దకు వెళ్లి తన ప్రసంగాన్ని గవర్నర్ చదివి వినిపిస్తూ..సీఏఏకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని చదివే సందర్భంలో గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్మానం తన అభిప్రాయానికి అనుగుణంగా లేదని.. కానీ ఈ పేరాగ్రాఫ్‌ను సీఎం పినరాయి విజయన్ చదవమన్నారని చదువుతున్నానని గవర్నర్ ఖాన్ వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగతంతో సీఏఏకు తాను వ్యతిరేకం కాదనీ సీఎం చదవమంటేనే ఈ పేరాగ్రాఫ్ ను చదివానని వెల్లడించారు. 

కాగా కేంద్ర ప్రభత్వం పౌరసత్వ సవరణ చట్టానికి కేరళ వ్యతిరేకితను కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గతంలో విమర్శించారు. కానీ ఈరోజు సీఎం పినరయి విజయన్ కోరికను గౌరవించటానికి సిఎఎ వ్యతిరేక భాగాన్ని తాను చదువుతున్నానని బుధవారం అసెంబ్లీలో తెలిపారు.