కేరళ ప్రభుత్వం కోవిడ్ వైరస్ నివారణ లో భాగంగా ముందస్తు చర్యలు చేపట్దింది. రాష్ట్రంలో మరో ఏడాది పాటు కోవిడ్ నిబంధనలు ఆమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పని సరి చేసింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. స్టేట్ ఎపిడెమిక్ డిసీజ్ ఆర్డినెన్స్ 2020కు సవరణలు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఉత్తర్వులను అమలుచేసేందుకు ఆదేశాలిచ్చింది.
పనిప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, ప్రతిచోటా 6 అడుగుల దూరం పాటించాలని, వచ్చే ఏడాది పాటు ఈ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని ఆ నోటిఫికేషన్‌లో పేర్కోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ. 10 వేల వరకు జరిమానా విధించనున్నారు.
వివాహా వేడుకలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే శిక్షార్ఙమని తెలిపింది. ధర్నాలు, నిరసనలు ర్యాలీలు వంటి ఎక్కవ మంది సమావేశమయ్యే సందర్భాల్లో ప్రభుత్వం నుంచి తప్పని సరిగా అనుమతి తీసుకోవాలంది. అనుమతి లభిస్తే వాటిలో 10 మంది కంటే ఎక్కువ ఎవ్వరా పాల్గోనరాదని చెప్పింది.
షాపులు, వ్యాపార ప్రదేశాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. వ్యాపార ప్రదేశాల్లోకి గరిష్టంగా 20 మందిని మాత్రమే అనుమతించాలి. కేరళ రాష్ట్ర్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారు తప్పని సరిగా కేరళ ప్రభుత్వం ఇ-ప్లాట్ ఫాం లో రిజిష్ట్రర్ చేసుకోవాలని పేర్కోన్నారు.
Read Here>>2021 దాకా కరోనా వ్యాక్సిన్ రాదు : సౌమ్య స్వామినాథన్