Kerala Man
Kerala Man : అంతరిక్షంలో అద్భుతాలు జరుగుతున్నాయి. పలువురు రోదసి ప్రయాణం చేస్తూ..రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్ చెందిన వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు తెలుగు అమ్మాయి బండ్ల శిరీషతో పాటు పలువురు దిగ్విజయంగా అంతరిక్ష యాత్ర చేసొచ్చారు. ఈ యాత్ర సక్సెస్ కావడంతో పలువురు అంతరిక్షంలోకి వెళ్లి రావాలని తహతహలాడుతున్నారు.
Read More : Vaccinated People Mask : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారంతా మాస్క్ ధరించాల్సిందేనా?
ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయ్యింది. తాజాగా..కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర రోదసిలో ప్రయాణించబోతున్నారు. భారతీయ తొలి రోదసి యాత్రికుడిగా ఇతను చరిత్ర సృష్టించబోతున్నారు. అమెరికాలోని గెలాక్టిక్ సంస్థకు చెందిన వ్యోమనౌకలో ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. ఈ యాత్ర కోసం ఆయన 2.5 లక్షల డాలర్లు (1.8 కోట్లు) ఖర్చు చేయనున్నారని సమాచారం.
Read More : AP Inter : ఇంటర్ ఫలితాలు విడుదల, సెకండ్ ఇయర్ విద్యార్థులు ప్రమోట్
అంతరిక్ష యాత్రను చేపట్టాలని 2007 నుంచి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకున్నారు. తనతో పాటు..ఓ కెమరా కూడా తీసుకెళుతున్నట్లు సంతోష్ వెల్లడించారు. ఇక సంతోష్ విషయానికి వస్తే..ఈయన 24 ఏళ్లలో 130కి పైగా దేశాలను తిరిగి వచ్చారు. సంచారం పేరిట ఇతను యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఇందులో యాత్ర విశేషాలను వెల్లడిస్తుంటారు.