AP Inter : ఇంటర్ ఫలితాలు విడుదల, సెకండ్ ఇయర్ విద్యార్థులు ప్రమోట్

AP Inter : ఇంటర్ ఫలితాలు విడుదల, సెకండ్ ఇయర్ విద్యార్థులు ప్రమోట్

AP Inter

AP Inter : ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 2021, జూలై 23వ తేదీ శుక్రవారం ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలను రద్దు చేశామని, కోర్టు తీర్పు ప్రకారం…వారం రోజుల ముందే రిజల్ట్స్ ప్రకటిస్తున్నామన్నారు.

Read More : Bharati Hollikeri : మంచిర్యాల జిల్లా కలెక్టర్‌‌కు నిరసన సెగ

మార్చి 21, 22వ తేదీన షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి అన్ని ప్రోటోకాల్ పాటించామని, కొన్ని ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశామన్నారు. మే05వ తేదీ నుంచి మొదలు పెట్టాల్సిన థియరీ పరీక్షలు నిర్వహంచుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టును తీర్పును అనుసరించి పరీక్షలను రద్దు చేశామన్నారు.

Read More : Mercedes EV: వెయ్యి కిమీ వరకు ఛార్జింగ్ అవసరం లేని మెర్సిడెస్!

ఒక్కొక్క రాష్ట్రం మార్కులను ఇచ్చిందని, దీనిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి..ఆయన ఆదేశాల మేరకు…హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్కుల విషయంలో అధ్యయనం చేసిన ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. ఫలితాలను ప్రకటించేందుకు ఫార్ములాను కమిటీ రూపొందించిందన్నారు. టెన్త్ పరీక్షల్లో మార్కుల ఆధారంగా 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నామని, ఇంటర్ ఫస్టియర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా మిగతా 70 శాతం వెయిటేజీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించారు. మార్కులతో సంతృప్తి చెందకుంటే…పరిస్థితులు చక్కబడ్డాక పరీక్ష నిర్వహిస్తామన్నారు.