Mercedes EV: వెయ్యి కిమీ వరకు ఛార్జింగ్ అవసరం లేని మెర్సిడెస్!

ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్న తరుణంలో మోటార్ కంపెనీలు కూడా అదే తరహాలో వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే ముందుగా ఎదురయ్యే సమస్య ఛార్జింగ్. వాహన శ్రేణి ఏదైనా ముందుగా ఛార్జింగ్ అంశమే ప్రధానంగా ఆలోచనకు వస్తుంది.

Mercedes EV: వెయ్యి కిమీ వరకు ఛార్జింగ్ అవసరం లేని మెర్సిడెస్!

Mercedes Ev

Mercedes EV: ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్న తరుణంలో మోటార్ కంపెనీలు కూడా అదే తరహాలో వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే ముందుగా ఎదురయ్యే సమస్య ఛార్జింగ్. వాహన శ్రేణి ఏదైనా ముందుగా ఛార్జింగ్ అంశమే ప్రధానంగా ఆలోచనకు వస్తుంది. అందుకే మెర్సిడెస్ బెంజ్ దీనిపై ఇప్పుడు దృష్టి పెట్టింది. ఒకసారి ఛార్జ్ చేస్తే వెయ్యి కిమీ ప్రయాణించేలా ఇప్పుడు మెర్సిడెస్ ప్రయత్నాలు చేస్తుంది.

మెర్సిడెస్ 2030 నాటికి అన్ని మోడళ్లను ఎలక్ట్రిక్‌ శ్రేణిలోకి మార్చేందుకు ప్రయత్నిస్తుండగా.. రాబోయే కొన్నేళ్లలో ప్రతి మోడల్‌కు బ్యాటరీతో నడిచే వేరియంట్‌ను అందించే ప్రణాళికలను ఈ మధ్యనే ప్రకటించింది. ఇందులో భాగంగా విజన్ ఇక్యూఎక్స్ఎక్స్ కాన్సెప్ట్ (Vision EQXX) గురించి ప్రకటించి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మెర్సిడెస్ విజన్ ఇక్యూఎక్స్ఎక్స్ (EQXX) ను ఎలక్ట్రిక్ టెక్నాలజీ ప్రోగ్రామ్‌గా నొక్కిచెప్పిన మెర్సిడెస్ ఇది ఛార్జ్ పనితీరును మరింత పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్తుంది..

మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం విజన్ ఇక్యూఎక్స్ఎక్స్ (Vision EQXX) ను అభివృద్ధి చేస్తోండగా.. దీని ద్వారా వాస్తవ ప్రపంచ శ్రేణి 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొందవచ్చని ధీమా వ్యక్తం చేస్తుంది. సాధారణ రహదారి డ్రైవింగ్ వేగంతో ఈ లక్ష్యాన్ని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. జర్మనీ లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ యొక్క F1 హై పెర్ఫార్మెన్స్ పవర్ట్రెయిన్ డివిజన్ నిపుణుల.. మల్టీ-డిసిప్లినరీ బృందం ఇప్పటికే బాల్ రోలింగ్‌ను సెట్ చేసిందని 2022 లోపు ఇందులో పురోగతి కనిపిస్తుందని చెప్తున్నారు.

మెర్సిడెస్ బెంజ్ పంచుకున్న టీజర్ చిత్రాల ప్రకారం, ఇక్యూఎక్స్ఎక్స్ EQXX కాన్సెప్ట్ తక్కువ-ఇష్ ప్రొఫైల్‌తో సెడాన్ అవుతుంది. దీని బాహ్య రూపకల్పనలో చాలా ఎక్కువ ప్రతికూలతలు ఉన్నా కదలికలో ఉన్నప్పుడు దీన్ని మరింత సమర్థవంతంగా చేసే అవకాశం ఉందని చెప్తుంది. మెర్సిడెస్ ఇప్పటికే కొంతకాలంగా ఆధిపత్యంలో ఉన్న టెస్లాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. టెస్లా రోడ్‌స్టర్ సుమారు 997 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా.. రాబోయే సైబర్‌ట్రక్ 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఛార్జ్ స్టామినా గురించి ఈ కంపెనీ గొప్పగా చెప్పుకుంటుంది. అయితే.. మెర్సిడెస్ దీన్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.