Monkey Fever: మంకీ ఫీవర్ అంటే ఏంటి.. లక్షణాలు

కేరళ రాష్ట్రంలో 2022వ సంవత్సరం వచ్చిన తర్వాత తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తిరునెల్లె గ్రామ పంచాయతీకి చెందిన పనవల్లీ గిరిజన ప్రాంతంలోని 24ఏళ్ల వ్యక్తికి..

Monkey Fever: మంకీ ఫీవర్ అంటే ఏంటి.. లక్షణాలు

Monkey Fever

Updated On : February 10, 2022 / 5:00 PM IST

Monkey Fever: కేరళ రాష్ట్రంలో 2022వ సంవత్సరం వచ్చిన తర్వాత తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తిరునెల్లె గ్రామ పంచాయతీకి చెందిన పనవల్లీ గిరిజన ప్రాంతంలోని 24ఏళ్ల వ్యక్తికి మంకీ ఫీవర్ వచ్చింది. సీజనల్ ఫీవర్ ఎక్కువగా ప్రబలుతున్న సమయంలో జిల్లా మెడికల్ ఆఫీసర్ డా. సకీనా అధికారులను అలర్ట్ చేశామని, స్థానికులకు సూచనలిచ్చామని తెలిపారు.

మంకీ ఫీవర్ సోకిన వ్యక్తిని మనంతవాడీ మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేశామని, మెడికల్ అబ్జర్వేషన్ లో ఉన్నాడని మెడికల్ ఆఫీసర్ చెప్పారు. ఒకే ఒక్క కేసు నమోదు కాగా అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వివరించారు.

మంకీ ఫీవర్ అంటే:
కోతుల నుంచి మనుషులకు సంక్రమించిన వైరల్ ఫీవర్. ఈ ఫీవర్ ప్లావివిరిడే అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతోంది. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులుగా ఉండటం దీని లక్షణాలు. కొంతమందిలో డెంగీ జ్వరానికి ఉండే లక్షణాలను కలిగి ఉంటుంది. మంకీ ఫీవర్ కారణంగా 5 నుంచి 10 శాతం మరణించే అవకాశం కూడా ఉంది. చనిపోయిన కోతుల నుంచి తాకడం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.

Read Also : సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలి.. జూబ్లిహిల్స్ తరహా ప్రాంతాన్ని

లక్షణాలు:
వికారంగా ఉండటం
వాంతులు అవుతుండటం
కండరాలు పట్టేయడం
కంటి దృష్టి తగ్గిపోవడం
విపరీతమైన తలనొప్పి
ప్రతిస్పందనలు తగ్గిపోవడం

ట్రీట్మెంట్ ఎలా:
ఇప్పటివరకూ కొవిడ్ మాదిరిగానే మంకీ ఫీవర్ కు కూడా ప్రత్యేకమైన చికిత్స లేదు. హెల్త్ కండిషన్ ను వెంటనే గుర్తించి నిపుణుల పర్యవేక్షణలో ఉంటూ వ్యాధిని తగ్గించుకోవాలి.

1957లో తొలిసారి
మొదటిసారిగా 1957లో కర్ణాటక రాష్ట్రంలోని క్యాసనూర్ ఫారెస్ట్‌లో బయటపడింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెంది. 2012 నుంచి ఏటా 500లకు పైగా మంకీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. KFD ద్వారా ప్రభావితమైన వారిలో 5 నుంచి 10% మంది బాధితులు రక్తస్రావ లక్షణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఐదేళ్లలో ఈ వ్యాధి కారణంగా కనీసం 340 మంది ప్రాణాలు కోల్పోయారు.