Kerala Train Fire
Kerala Train Fire: కేరళలో దారుణం చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వివాదం తలెత్తడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళతో సహా ముగ్గురు మరణించారు. రైలు బోగీకికూడా మంటలు వ్యాపించడంలో ప్రయాణీకులు భయబ్రాంతులకు గురయ్యారు. చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరినిచికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Fire In Train : రైలులో ఎగసిపడిన మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం
అలప్పుజా – కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లోని డీ1 కోచ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌ను దాటి కోరాపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఎక్కే సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సీటు విషయంలో మహిళతో వ్యక్తి గొడవ పడ్డాడు. అయితే బోగీలోని కొందరు ప్రయాణీకులు మహిళకు మద్దతుగా నిలిచాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వ్యక్తి.. తన వద్దఉన్న పెట్రోల్ బాటిల్ ను తీసుకొని మహిళా ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ చిన్నారి, మరో వ్యక్తికిసైతం తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురు మరణించారు.
Train To Kashmir: దేశంతో అనుసంధానం కానున్న కశ్మీర్ లోయ.. 2024 నాటికే తొలి రైలు పరుగులు
మంటలు బోగీకి వ్యాపించడంతో ప్రయాణీకులు చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బోగీలోని తొమ్మిది మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీఎఫ్) కు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అయితే, పెట్రోల్ పోసింది ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు.
నిందితుడు వేరే వ్యక్తుల సహాయంతో బైక్ పై పరారైనట్లు చూపుతున్న సీసీటీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉంటే ప్రమాద సమయంలో మహిళ, ఓ చిన్నారి కనిపించకుండా పోయినట్లు గాయపడిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళ ఫోన్, పాదరక్షలను గుర్తించారు.