Train To Kashmir: దేశంతో అనుసంధానం కానున్న కశ్మీర్ లోయ.. 2024 నాటికే తొలి రైలు పరుగులు
రైల్వే విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఉన్నప్పటికీ కశ్మీర్ లోయతో మాత్రం సంబంధాలు లేవు. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ యేడాది చివరి నాటికి పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలోనే దేశం నుంచి కశ్మీర్ లోయకు రైలు నడిపేందుకు సిద్ధమవుతోంది

Train Line To Kashmir For 1st Time By Early 2024
Train To Kashmir: భూతల స్వర్గంగా పిలువబడే కశ్మీర్ లోయకు రైల్వే మార్గం ఏనాటి నుంచో ఉన్న కల. వాస్తవానికి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అక్కడి వరకు రోడ్డు మార్గం కూడా క్లిష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇలాంటి అడ్డంకులను చేధించి శ్రీనగర్ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఉద్ధాంపూర్ వరకు ఇది పూర్తైంది. 2025 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. కాగా, దీని కంటే ముందే ఈ రెండు నగరాల మధ్య రైలు పరుగులు పెట్టనుంది.
Tamilnadu: అలా జరిగితే రాజీనామా చేస్తానని, అంతలోనే మాట మార్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రైల్వే విషయంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఉన్నప్పటికీ కశ్మీర్ లోయతో మాత్రం సంబంధాలు లేవు. అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ యేడాది చివరి నాటికి పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలోనే దేశం నుంచి కశ్మీర్ లోయకు రైలు నడిపేందుకు సిద్ధమవుతోంది. అంతే కాదు, శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును సైతం నడిపేందుకు ప్రణాళికలు సాగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Mayawati: అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. రాహుల్ అనర్హతపై భిన్నరీతిలో స్పందించిన మాయావతి
అయితే అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త వందేభారత్ రైలును రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగానీ, వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలోగానీ రైలు పరుగులు తీస్తుందని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. చీనాబ్ నది మీద దేశంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే ఉద్ధాంపూర్-బారాముల్లా మధ్య రైల్వే లింకు పనుల్లో అతిపెద్ద మైలు రాయిని చేరుకున్నట్లు అవుతుంది.
LB Nagar RHS Flyover : ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఈ విషయమై రైల్వే మంత్రి ఓ సందర్భంలో స్పందిస్తూ ‘‘జమ్మూ కశ్మీర్ కోసం ప్రత్యేకమైన వందేభారత్ రైలును రూపొందిస్తున్నాం. హిమపాతం సహా ఇతర వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా అది ఉండాలి. అందుకు అనుగుణంగా రైలును తయారు చేస్తున్నాము. రైలులో వేడిని అందించే సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలు ఉంటాయి. వచ్చే ఏడాది మధ్య నాటికి ఈ రైలు కాశ్మీర్ లోయలో చేరుతుంది’’ అని అన్నారు.