చెన్నై ఎయిర్ పోర్టులో 1.16 కిలోల బంగారం అక్రమ రవాణా..ఇద్దరు అరెస్టు

  • Published By: madhu ,Published On : August 29, 2020 / 07:26 AM IST
చెన్నై ఎయిర్ పోర్టులో 1.16 కిలోల బంగారం అక్రమ రవాణా..ఇద్దరు అరెస్టు

Updated On : August 29, 2020 / 9:30 AM IST

ఎయిర్ పోర్టులో స్మగ్లర్లు కొత్త కొత్తగా ఆలోచిస్తూ..బంగారం, నగదు అక్రమంగా తరలిస్తున్నారు. కానీ వినూత్నంగా తరలించాలని అనుకుంటున్నా..వారి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. చెన్నై ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.



షార్జా నుంచి బంగారం అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎయిర్ పోర్టులో ప్రత్యేక నిఘా ఉంచారు. తిరువరూర్ నుంచి వచ్చిన జాహిర్ హుస్సేన్ (54) ప్రయాణికుడు ఆందోళన, ఆత్రుత నడుమ ఓ పెట్టెతో వెళ్లేందుకు ప్రయత్నించాడు. అధికారులు గుర్తించి పట్టుకున్నారు.
https://10tv.in/rafale-fighter-jets-to-be-formally-inducted-into-iaf-on-september-10-french-defence-minister-invited/
తనిఖీలు చేయగా..పెట్టెలో ఓ ఎలక్ర్టానిక్ వస్తువులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. 1.16 కిలో గ్రాముల బంగారం (24 క్యారెట్), దీని విలువ రూ. 64 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ..ఇది తనది కాదని హుస్సేన్ వెల్లడించినట్లు అధికారులు వెల్లడించారు. తనకు ఈ టూల్ కిట్ అప్పగించాడని, గిండిలో క్వారంటైన్ సౌకర్యం ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ వ్యక్తి దీనిని తీసుకుంటాడని చెప్పారని ఆ వ్యక్తి పేర్కొన్నాడన్నారు.



వెంటనే అధికారులు ఓ బస్సులో అతడిని తీసుకెళ్లారు. ఇతరులకు ఏమాత్రం అనుమానం కలుగకుండా వ్యవహరించారు. ఓ హోటల్ వద్ద నిలబడిన వ్యక్తికి టూల్ కిట్ అందచేస్తుండగా..కస్టమ్స్ అధికారులు దాడి చేసి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. మహ్మద్ ఆసీఫ్ (33) గా గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.