Kheer Malpua : 2 లక్షల మందికి అన్నదానం..కాంక్రీట్ మిక్సర్‌‌లో మిఠాయి తయారు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మెరెనా జిల్లా చంబల్ ప్రాంతంలో మౌనీ బాబా ఆశ్రమం ఉంది. అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. భగవత్ కథా చివరి రోజు....

Mp

Kheer Malpua Concrete Mixer : కాంక్రీట్ మిక్సర్ దేనికి ఉపయోగిస్తారు ? అదేం ప్రశ్న…ఇంక దేనికి…నిర్మాణాల రూఫ్ విషయంలో ఉపయోగిస్తారు అంటారు కదా. కానీ…ఓ ప్రాంతంలో అన్నదానానికి దీనిని ఉపయోగించారు. భారీ అన్నదాన కార్యక్రమంలో…ఓ స్వీటు పదార్థానినికి ఉపయోగించి..వచ్చిన వారికి వడ్డించారు. లక్షల సంఖ్యలో హాజరవడంతో ఆహారం త్వరగా తయారు చేసేందుకు కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని ఉపయోగించారు. దీనికి సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More : Tornadoe : కెంటకీలో యుగాంతం సినిమా క్లైమాక్స్‌ దృశ్యాలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మెరెనా జిల్లా చంబల్ ప్రాంతంలో మౌనీ బాబా ఆశ్రమం ఉంది. అక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. భగవత్ కథా చివరి రోజు సందర్భంగా..శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దాదాపు రెండు లక్షల మంది హాజరైనట్లు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో భక్తులు హాజరవడంతో త్వరగా ఆహారం తయారు చేయడానికి కాంక్రీట్ మిక్సర్ ను తెప్పించారు. ఖీర్- మల్పువా (స్వీటు) కోసం ట్రాలీల్లో పిండి, నెయ్యి, నూనెను తీసుకొచ్చి కాంక్రీట్ మిక్సర్ లో వేసి కలిపారు.

Read More : Hyderabad Covid : కోవిడ్ టెస్టులు..ఇండియాలో హైదరాబాద్ థర్డ్ ప్లేస్

లక్షల మందికి ఈ స్వీటును తయారు చేయాలంటే కష్టం అవుతుంది కనుకే…కాంక్రీట్ మిక్సర్‌లో వేసి కలిపారని అంటున్నారు. అందులో వేసిన అనంతరం పెద్ద పెద్ద కడాయిలో స్వీటును వేసి వచ్చిన వారికి వడ్డించారు. గతంలో కూడా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో దీనిని ఉపయోగించారని తెలుస్తోంది. ఆహారం వడ్డించడానికి దాదాపు 15 ట్రాలీలను ఉపయోగించారు. ఇక ఈ అన్నదాన కార్యక్రమానికి 100 గ్రామాల నుంచి భక్తులు వచ్చారని తెలుస్తోంది. వచ్చిన వారంతా…పాలు, కూరగాయలు, ఇతర పదార్థాలను తీసుకొచ్చారని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం..రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది.