రోడ్డుపై.. 2.5కిమీల దూరం ప్రేమ కవితలు రాసిన ప్రియుడు..

రోడ్డుపై.. 2.5కిమీల దూరం ప్రేమ కవితలు రాసిన ప్రియుడు..

Man Paints 2.5 Km Road With Love Message (2)

Updated On : March 27, 2021 / 11:22 AM IST

Man paints 2.5 km road with Love message : ప్రేయసికి ప్రియుడు ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో తన ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటాడు. దాని కోసం ఎన్నో చేస్తాడు. ‘వావ్..నేనంటే నీకు ఎంత ప్రేమ?!’’అని ప్రియురాలితో అనిపించుకోవటానికి ఆమెను ఇంప్రెస్ చేయటానికి ఎన్నెన్నో చేస్తాడు. అటువంటి ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం ఏం చేశాడో తెలుసా? వింటే షాక్ అవ్వాల్సిందే..

మహారాష్ట్రలోని కొల్హాపూర్ కుర్రాడు ఓ రహదారిపై ఏకంగా 2.5 కిలోమీటర్ల పొడవునా తన ప్రేమ పరిచాడు. తన గుండెలో ప్రేయసి అంటే ఎంత ప్రేమో రాసుకొచ్చాడు. రోడ్డుపై 2.5 కిలోమీటర్ల దూరం పాటు ప్రేమ కవితలు రాశాడు. వాటిలో ‘ఐ లవ్యూ’, ‘ఐ మిస్ యూ’ అంటూ తన హృదయాన్ని నడిరోడ్డుమీద గుమ్మరించాడా ప్రేమికుడు. రోడ్డును తన ప్రేమతో నింపేశాడు. వీటిలో ఒక మెసేజిలో ‘మిస్ యూ. జిందగీ కే సాత్, జిందగీ కే బాద్ భీ’ అంటూ కవితలు అల్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.