Kolkata Doctor Case : కోల్‌కతాలో పీజీ వైద్యురాలి ఘటన.. తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్

కోల్‌కతాలోని ఆర్.జి.కార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష అత్యాచారం, హత్య నేపథ్యంలో వైద్యుల ఆందోళన కొనసాగుతోంది.

Kolkata Doctor Case

Kolkata Doctor Case IMA Announced Strike : కోల్‌కతాలోని ఆర్.జి.కార్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష అత్యాచారం, హత్య నేపథ్యంలో వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది. దీంతో శనివారం ఉదయం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నారు. అత్యవసర వైద్యసేవలు మాత్రమే కొనసాగనున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని, అవసరమైతే హంతకుడికి ఉరి శిక్ష వేయించడానికి కూడా తమ ప్రభుత్వం వెనుకాడదని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read : Group 1 Mains Exam : గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ రిలీజ్‌.. పరీక్షలు ఎప్పుడంటే? 

ఐఎంఏ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 24గంటలు పాటు ఓపీ సేవలు అందుబాటులో ఉండవని ఐఎంఏ రాష్ట్ర విభాగం ప్రకటించింది. కోల్ కతా ఘటనకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ లో వైద్యులు ఇవాళ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ధర్నా చేపట్టనున్నారు. ఐఎంఏ పిలుపుతో అపోలో, కిమ్స్, స్టార్, యశోద, రెయిన్ బో, కిమ్స్ -సన్ షైన్ ఆస్పత్రులతోపాటు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు 24గంటలు బంద్ కానున్నాయి. నిమ్స్ లోనూ శనివారం ఓపీ ఉండదని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని ఐఎంఏ తెలిపింది.

 

ఐఎంఏ పిలుపు మేరకు ఏపీలోనూ 24గంటలపాటు ఓపీ సేవలను నిలిపివేస్తున్నామని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా (ఏఎస్ఐ) రాష్ట్ర శాఖ పేర్కొంది. ఆదివారం ఉదయం 6గంటల వరకు ఓపీలు పనిచేయవని, సర్జరీలు వాయిదా వేస్తామని, కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఏఎస్ఐ రాష్ట్ర శాఖ పేర్కొంది.

 

 

ట్రెండింగ్ వార్తలు