Lalitpur Minor Rape..ఎస్పీ,బీఎస్పీ నేతలు అరెస్ట్

లలిత్ పూర్ మైనర్ రేప్ కేసులో ఎస్పీ,బీఎస్పీ పార్టీల నేతల సహా ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

Lalitpur Minor Rape..ఎస్పీ,బీఎస్పీ నేతలు అరెస్ట్

Lalaitpur

Updated On : October 16, 2021 / 9:00 PM IST

లలిత్ పూర్ మైనర్ రేప్ కేసులో ఎస్పీ,బీఎస్పీ పార్టీల నేతల సహా ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. గత ఐదేళ్లుగా 25 మంది తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 17 ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ అరెస్ట్ లు జరిగాయని లలిత్ పూర్ ఎస్పీ నిఖిల్ పథక్ తెలిపారు.

బాధితురాలి తండ్రి, మేనమామ, ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు సహా 25 మందిపై సర్దార్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 12న కేసు నమోదైందని తెలిపారు. మీర్జాపూర్ జిల్లాలోని ఓ హోటల్‌పై శుక్రవారం దాడులు జరిపి లలిత్‌పూర్ సమాజ్‌వాదీ పార్టీ జిల్లా చీఫ్ తిలక్ యాదవ్, బీఎస్‌పీ జిల్లా చీఫ్ దీపక్ అహిర్‌వర్, మహేంద్ర డూబే అనే ఒక ఇంజనీర్‌ను అరెస్టు చేసి స్థానిక కోర్టు ముందు హాజరుపరిచామని నిఖిల్ పాథక్ తెలిపారు. వీరిని 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించిందని తెలిపారు.

ALSO READ  Srinagar : వీధివర్తకుడిని కాల్చి చంపిన టెర్రరిస్టులు