×
Ad

Rohini Acharya: లాలూ కుటుంబంలో ఓటమి చిచ్చు.. కూతురు సంచలన నిర్ణయం..

2024లో శరణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ చేతిలో ఓటమి పాలైంది.

Rohini Acharya: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చు రాజేసింది. ఆయన కుటుంబంలో చీలిక ఏర్పడింది. లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు సంచలన నిర్ణయం తీసుకుంది. లాలూ కూతురు రోహిణి ఆచార్య ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పింది. అంతేకాదు లాలూ కుటుంబంతో కూడా సంబంధాలు కట్ చేసుకుంది. తన భర్త రమీజ్ ఆలం, ఆర్జేడీ రెబల్ నేత సంజయ్ యాదవ్ సూచనతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిణి తెలిపింది.

రోహిణి ఆచార్య డాక్టర్ వృత్తిలో ఉంది. 2024లో శరణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ చేతిలో ఓటమి పాలైంది. రోహిణి నిర్ణయం బీహార్ ఎన్నికలకు ముందే పార్టీలో చిచ్చు రేపింది. అప్పట్లో లాలూ, సోదరులు తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్, పార్టీ ఎక్స్ హ్యాండిల్స్ అన్ ఫాలో చేసింది. 2022లో తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేస్తానని రోహిణి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కిడ్నీ ఇవ్వడానికి నిరాకరించిందని వార్తలు వచ్చాయి.

నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. నా కుటుంబాన్ని వదిలేస్తున్నా. సంజయ్ యాదవ్, రమీజ్ నన్ను ఇదే చేయమని అడిగారు… అందుకే ఈ నిందనంతా నేనే తీసుకుంటున్నా” అని రోహిణి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్ తో కలిసి కూటమిగా బరిలోకి దిగిన ఆర్జేడీకి భారీ షాక్ ఇచ్చారు బిహార్ ఓటర్లు. ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. మహాఘట్ బంధన్‌ను ఓడించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఎన్డీయే 202 సీట్లు సాధించగా, మహాఘట్ బంధన్ 34 సీట్లకు పరిమితమైంది. ఎన్డీయేలో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలుచుకున్నాయి. మహాఘట్ బంధన్‌లో ఆర్జేడీకి 25, కాంగ్రెస్ కి 6 సీట్లు దక్కాయి. ఈ షాక్ నుంచి తేరుకోకముందే.. లాలూ కుటుంబంలో చిచ్చు రేగింది. లాలూ కూతురు సంచలన నిర్ణయం తీసుకుంది.

తాజా ఘటనతో లాలూ కుటుంబంలో ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. కొన్ని నెలల క్రితం లాలూ ప్రసాద్ తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీనికి కారణం ఒక సోషల్ మీడియా పోస్ట్. ఆర్జేడీ నుంచి బహిష్కరణ తర్వాత తేజ్ ప్రతాప్ యాదవ్.. జనశక్తి జనతా దళ్ అనే కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. అంతేకాదు తేజస్వీ యాదవ్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని కూడా నిలిపారు.

Also Read: బిహార్‌లో ఎన్డీఏ సునామీపై అన్ని సర్వేలు ఫెయిల్.. ఈ ఒక్కటి మాత్రం కెవ్వుకేక..