NDA Victory: బిహార్‌లో ఎన్డీఏ సునామీపై అన్ని సర్వేలు ఫెయిల్.. ఈ ఒక్కటి మాత్రం కెవ్వుకేక..

ఇంతటి మెజార్టీ వస్తుందని ఇతర సంస్థలు అంచనా వేయలేకపోయాయి.

NDA Victory: బిహార్‌లో ఎన్డీఏ సునామీపై అన్ని సర్వేలు ఫెయిల్.. ఈ ఒక్కటి మాత్రం కెవ్వుకేక..

Updated On : November 15, 2025 / 3:33 PM IST

NDA Victory: బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏకు 202, మహాగఠ్‌బంధన్‌కు 34, ఇతరులకు 7 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ గెలుస్తుందని చెప్పాయి.

కానీ, ఇంతటి మెజార్టీ వస్తుందని అంచనా వేయలేకపోయాయి. ఒక్క సంస్థ మాత్రం ఫైనల్‌ రిజల్ట్స్‌ను ముందుగానే చెప్పేసిందా? అన్నట్లు అంచనాలను కచ్చితత్వంతో వెల్లడించింది. అదే కామాఖ్యా అనలిటిక్స్. ఎన్డీఏకు 187 రావచ్చని అంచనా వేసింది. మిగతా సంస్థలతో పోల్చితే కామాఖ్యా అనలిటిక్స్ బెటర్‌.

ఆ సంస్థ ఎన్డీఏకు167–187, మహాగఠ్‌బంధన్‌కు 54–74, జేఎస్పీ, జేఎస్‌యూపీకి 0–2, ఇతరులకు 2–7 సీట్లు వస్తాయని చెప్పింది. దీంతో ఇతర సంస్థలన్నింటి కన్నా బెటర్‌గా అంచనా వేసిన సంస్థగా నిలిచింది.

ఏ సంస్థ ఎలా అంచనా వేసింది?

సర్వే సంస్థ NDA MGB JSP / JSUP ఇతర / స్వతంత్రులు
తుది ఫలితం 202 34 7
కామాఖ్యా అనలిటిక్స్ 167–187 54–74 0–2 2–7
మాట్రైజ్ 147–167 70–90 5 10
టుడే’స్ చాణక్య 148–172 65–89 3–9
భాస్కర్ 145–160 73–91 5–10
పి-మార్క్ 142–162 80–98 1–4 0–3
పీపుల్స్ పల్స్ 133–159 75–101 0–5 2–8
జేవీసీ 135–150 88–103 3–7
పోల్స్‌ట్రాట్ 133–148 87–102 3–5
పీపుల్స్ ఇన్సైట్ 133–148 87–102 0–2 3–6
వోట్ వైబ్ 125–145 95–115 0–2 1–3
ఆక్సిస్ మై ఇండియా 121–141 98–118 0–2 1–5
న్యూస్ పించ్ / ఏఐ పాలిటిక్స్ 115–127 113–125 1–5
ధ్రువ్ 132–156 85–108 1–4