Haryana : నీటిని చీల్చుకుంటూ..పైకి వచ్చిన భూమి, వింత ఘటన

భూమి ఎప్పుడైనా పైకి రావడం చూశారా ? అది కూడా నీటిని చీల్చుకుంటూ మెల్లిమెల్లిగా భూమి పైకి పెరిగిన వింత ఘటన ఒకటి చోటు చేసుకొంది. భూమి కుంగిపోవడం వంటి లాంటి ఘటనలు చూశాం. కానీ..గిదేంటి భూమి పైకి రావడం ఏంటీ అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Haryana : నీటిని చీల్చుకుంటూ..పైకి వచ్చిన భూమి, వింత ఘటన

Haryana

Updated On : July 22, 2021 / 8:02 PM IST

Land Starts Rising Abruptly : భూమి ఎప్పుడైనా పైకి రావడం చూశారా ? అది కూడా నీటిని చీల్చుకుంటూ మెల్లిమెల్లిగా భూమి పైకి పెరిగిన వింత ఘటన ఒకటి చోటు చేసుకొంది. భూమి కుంగిపోవడం వంటి లాంటి ఘటనలు చూశాం. కానీ..గిదేంటి భూమి పైకి రావడం ఏంటీ అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన వారు నోరెళ్ల బెడుతున్నారు. ఇది నిజమైనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైకి లేచిన ఈ ప్రాంతాన్ని చూడటానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Etharkkum Thunindhavan : సూర్య 40.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్..

కర్నాల్ లోని నైసింగ్ నార్ధక్ కాల్వ ఉంది. ఇక్కడనే ఓ పొలం ఉంది. గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో…స్థానికులు పొలం పనులు చేయడానికి సిద్ధమయ్యారు. అకస్మాత్తుగా నీటిని చీల్చుకుంటూ..భూమి పైకి రావడం కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్ లలో బంధించారు.

Read More : Jeff Bezos Skittles : బ్లూ ఆరిజిన్ వ్యోమనౌకలో స్కిటిల్స్ కాండీతో ఆడిన బెజోస్ బృందం.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అసలు భూమి పైకి ఎందుకు లేచిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటన చూడడం ఫస్ట్ టైమ్ అని గ్రామస్థులు వెల్లడిస్తున్నారు. పొలాల్లో పనిచేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.