Baba Siddique
Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధిఖీ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ అవుతుంది. ఇందులో సల్మాన్ ఖాన్, దావూద్ గ్యాంగ్ గురించి కూడా ప్రస్తావించారు. అయితే, ఈ పోస్ట్ కు సంబంధించి ముంబై పోలీసులు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టును చూశామని.. ఆ పోస్టుకు సంబంధించిన ప్రామాణికతను పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఓం.. జై శ్రీరామ్, జై భారత్ నినాదాలతో పోస్ట్ ప్రారంభమైంది. నేను జీవితం సారాంశాన్ని అర్థం చేసుకున్నాను. సంపద, శరీరాన్ని ధూళిగా భావిస్తున్నాను. నేను ఒక మంచి పని చేశాను. స్నేహం యొక్క కర్తవ్యాన్ని గౌరవించాను అని పేర్కొంటూ.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపర్ వంటి అండర్ వరల్డ్ వ్యక్తులతో సిద్ధిఖీకి ఉన్న సంబంధాలే హత్యకు కారణమని ముఠా సభ్యుడు ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నాడు. సల్మాన్ ఖాన్, దావూద్ గ్యాంగ్ కు ఎవరు సహాయం చేసినా మూల్యం చెల్లించవలసి ఉంటుందని పోస్టులో హెచ్చరించారు.