Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందా.. పోలీసులకు పట్టుబడిన ముగ్గురు ఎవరంటే..?

సిద్ధిఖీ హత్య ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం ‘గెలాక్సీ అపార్ట్ మెంట్స్’ బయట భద్రత పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ..

Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందా.. పోలీసులకు పట్టుబడిన ముగ్గురు ఎవరంటే..?

Baba Siddique Death Case

Updated On : October 13, 2024 / 12:45 PM IST

Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన బాబా సిద్ధిఖీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీసులో ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను వెంటనే ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బాబా సిద్ధిఖీ మరణించారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితుల్లో హరియాణాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ధర్మరాజ్ కశ్యప్ గా గుర్తించారు. వీరిద్దరూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పరారీలో ఉన్న నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు చెందిన శివకుమార్ అని తెలిపారు.

Also Read: Baba Siddique : మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై దుండగుల కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి!

బాబా సిద్ధిఖీ హత్య కేసును ముంబై క్రైం బ్రాంచ్ లోని యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ దర్యాప్తు చేస్తోంది. సిద్ధిఖీ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితులు బాంద్రా ఈస్ట్ లోని షూటింగ్ స్పాట్ లో దాదాపు నెల రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. బాబా సిద్ధిఖీకి ప్రాణహాని ఉందని అతడి సన్నిహితులు పేర్కొనడంతో గత పదిహేను రోజుల క్రితమే వై కేటగిరీ భద్రత కల్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

Also Read: ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?: రాహుల్ గాంధీ

సిద్ధిఖీ హత్య ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం ‘గెలాక్సీ అపార్ట్ మెంట్స్’ బయట భద్రత పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. సల్మాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్ ఖాన్ నివాసం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

బాబా సిద్ధిఖీ మృతదేహానికి ముంబైలోని కూపర్ హాస్పిటల్ లో పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అంతక్రియల ఇవాళ రాత్రి 8.30 గంటల సమయంలో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు జీషన్ సిద్ధిఖీ తెలిపారు. సిద్ధిఖీకి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలుకుతామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు.