Rajasthan: కాలు విరిగిన కొడుకుని స్కూటర్ మీద లిఫ్ట్‌లో తీసుకెళ్లిన లాయర్.. ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర సంఘటన

కాలు విరిగిన కొడుకును ఆసుపత్రి 3 వ అంతస్తులోకి తీసుకెళ్లడానికి స్కూటర్‌పై లిఫ్ట్‌లో తీసుకెళ్లాడు ఓ తండ్రి. వీల్ చైర్‌లో తీసుకెళ్లకుండా స్కూటర్ మీద తీసుకెళ్లడం ఏంటా? అని ఆశ్చర్యపోతున్నారా? చదవండి.

Rajasthan

Rajasthan: కొడుకుకి కాలు విరిగింది. ఆసుపత్రి 3 వ అంతస్తుకి తీసుకెళ్లాలంటే వీల్ చైర్లు లేవు. రాజస్థాన్ కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఇది. తన బిడ్డను మూడవ అంతస్తుకి తీసుకెళ్లడానికి ఆ తండ్రి స్కూటర్‌పై తీసుకెళ్లిన ఘటన వైరల్ అవుతోంది.

Rajasthan : 51 ట్రాక్టర్లపై 200 మంది అతిథులు.. రాజస్థాన్‌లో వైరల్ అవుతున్న పెళ్లి ఊరేగింపు

రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్రమైన సంఘటన జరిగింది. మనోజ్ జైన్ అనే లాయర్ కోట డివిజన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి కాలు విరిగిన తన 15 సంవత్సరాల కొడుకుని ఆందోళనగా తీసుకువచ్చారు. ఆర్థోపెడిక్ వార్డుకు తరలించాలంటే 3 వ అంతస్తుకి చేరుకోవాలి. అందుబాటులో వీల్ చైర్లు కనిపించలేదు. ఇక చేసేది లేక మనోజ్ జైన్ తన ఇ-స్కూటర్‌పై ఎలివేటర్‌ను సమీపించి అందులోనే తన కొడుకుని 3 వ అంతస్తుకి తీసుకెళ్లాడు. ఈ ఘటన చూసిన అక్కడివారంతా ఆశ్చర్యపోయారు.

 

అయితే ఆసుపత్రికి చేరుకోగానే వీలై చైర్ కోసం ముఖేష్ మరియు సుఖ్ లాల్ అనే ఆసుపత్రి సిబ్బందిని కోరినా వీల్ చైర్లు అందుబాటులో లేవని చెప్పారని మనోజ్ జైన్ చెబుతున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తన స్కూటర్‌పై కొడుకును తీసుకెళ్లానని అందుకు వారిద్దరూ అనుమతిచ్చారని చెప్పాడు. అయితే తిరిగి కిందకు వచ్చే క్రమంలో వార్డు ఇన్‌ఛార్జి దేవకీనందన్ వారిని అడ్డగించాడు. అతని ఇ-స్కూటర్ తాళం తాక్కున్నాడు. ఇది కాస్త పోలీసుల వరకూ వెళ్లింది. చివరికి వీల్ చైర్ల కొరత ఉందని అంగీకరించిన దేవకీనందర్ వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Sandstorm: రాజస్థాన్‭లో 80 అడుగుల ఎత్తులో భయంకరమైన ఇసుక తుఫాను

ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @nanditathhakur అనే ట్విట్టర్ యూజర్ నుంచి షేర్ చేశారు. ‘రాజస్థాన్‌లోని కోటాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవి సర్వసాధారణంగా కనిపించే సాధారణ దృశ్యాలు. వీటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోవట్లేదు.. షాక్‌కి గురి కావట్లేదు’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.