Rajasthan : 51 ట్రాక్టర్లపై 200 మంది అతిథులు.. రాజస్థాన్‌లో వైరల్ అవుతున్న పెళ్లి ఊరేగింపు

ఫలానా వారింట్లో పెళ్లంటే పదికాలాలు చెప్పుకోవాలి అనే మాటను ఈకాలంలో నిజం చేస్తున్నారు. తమ ఇంటి పెళ్లి వేడుకలు ప్రత్యేకంగా ఉండాలని చాలామంది భావిస్తున్నారు. వరుడి వైపు నుంచి 51 ట్రాక్టర్లలో.. 200 మంది అతిథులు ఊరేగింపుగా వెళ్లారు. ఇప్పుడు ఈ పెళ్లి ఊరేగింపు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

Rajasthan : 51 ట్రాక్టర్లపై 200 మంది అతిథులు.. రాజస్థాన్‌లో వైరల్ అవుతున్న పెళ్లి ఊరేగింపు

Viral News

Updated On : June 15, 2023 / 11:44 AM IST

Viral News : పాతకాలంలో లాగ కాదు.. ఇప్పుడు పెళ్లిళ్లు ప్రత్యేకంగా చేయాలని అనుకుంటున్నారు. ఇక తమ ఇంటి వివాహ వేడుకల గురించి గొప్పగా అందరికీ తెలియాలని అనుకుంటున్నారు. రాజస్ధాన్‌లో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు ఇప్పుడు వైరల్ అవుతోంది.

Kangana Ranaut : పెళ్లి చేసుకోబోతున్న కంగనా.. మీడియాకి వెడ్డింగ్ కార్డు.. ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్!

రాజస్థాన్‌లోని బార్మర్‌లో మగ పెళ్లివారి ఊరేగింపు చర్చనీయాంశంగా మారింది. వరుడితో పెళ్లి ఊరేగింపు 51 ట్రాక్టర్లలో బయలుదేరింది. వాటిలో ఒకటి వరుడు స్వయంగా నడిపాడు. ఈ ఆలోచన పెళ్లికొడుకు తండ్రిదేనట. గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరికి రోలి గ్రామానికి చెందిన మమతతో పెళ్లి జరిగింది. ఈ వేడుకలో భాగంగా వరుడి ఇంటి నుంచి ఊరేగింపుగా 51 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోలీ గ్రామానికి బయలుదేరింది. 51 ట్రాక్టర్లలో 200 మందికి పైగా అతిథులు వచ్చారు.

Viral Video: యువతిని కిడ్నాప్ చేసి, అడవిలో పెళ్లి చేసుకున్నాడు.. నెట్టింట వీడియో వైరల్

పెళ్లికొడుకు తండ్రి జేతారామ్ తండ్రి, తాతల పెళ్లిళ్లను ఒంటెలపై ఊరేగింపుగా వెళ్లి నిర్వహించారట. తన పెళ్లి సమయంలో ఒక ట్రాక్టర్ లో ఊరేగింపుగా వెళ్లాడట. అయితే తన కొడుకు పెళ్లి సమయంలో 51 ట్రాక్టర్లు ఉండాలని అనుకున్నాడట. వ్యవసాయం ప్రధానంగా వృత్తిగా చేసుకుని జీవిస్తున్న వీరి కుటుంబాల్లో 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉన్నాయట. మిగిలిన రైతు స్నేహితుల నుంచి కలిపి మొత్తం 51 ట్రాక్టర్లపై ఈ పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. ఇక ఇన్ని ట్రాక్టర్లతో ఊరేగింపుగా పెళ్లికూతురి గ్రామానికి చేరుకోగానే అందరూ ఆశ్చర్యపోయారట. ఇలా వీరి పెళ్లి వేడుక ప్రత్యేకంగా నిలిచిందన్నమాట.