Tamil Nadu: ఒక్క నిమ్మకాయ రూ.5.9లక్షలు.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

తమిళనాడులో ఓ నిమ్మకాయను వేలం వేయగా అది ఏకంగా రూ.5.9లక్షలు పలికింది.

lemon auction

Lemon Auction: ఒక్క నిమ్మకాయ ధర ఎంత ఉంటుంది..? మరీ పెద్దకాయ అయితే పది రూపాయలు ఉంటుందేమో. కానీ, తమిళనాడులో ఓ నిమ్మకాయను వేలం వేయగా అది ఏకంగా రూ.5.9లక్షలు పలికింది. ఎందుకు దీనికంత ధర అని అనుకుంటున్నారా..? హైదరాబాద్ లో గణేశుని చేతిలోని లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పలు ప్రాంతాల్లో లక్షలు వెచ్చించి పోటీపడి మరీ లడ్డూను దక్కించుకుంటారు. అదే తరహాలో తమిళనాడులోని పళనిలో మురుగన్ పాదాల చెంత పెట్టే నిమ్మకాయకు కూడా అంత ప్రాశస్త్యం ఉంది.

Also Read: బాబోయ్.. కిలోల కొద్దీ బంగారం.. జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ.. అందులో ఏమేం వస్తువులున్నాయంటే..

పదుక్కోటై జిల్లా తిరువరుంగుళం వల్లనాట్టు చెట్టియార్ వర్గీయులు పళనిలో ప్రతీయేటా మూడు రోజులపాటు తైపూస ఉత్సవాలు నిర్వహిస్తారు. మూడు పూటల (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) అన్నదానం చేసే సమయాల్లో స్వామి పాదాల వద్ద ఒక్కొ నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. వాటిని గురువారం వేలం వేశారు. అయితే, ఈ వేలంలో కేవలం వల్లనాట్టు చెట్టియార్లు మాత్రమే పాల్గొంటారు. ఒక్కో నిమ్మకాయ రూ.16వేలు నుంచి రూ.40వేలు వరకు పలికింది. అయితే, తైపూసం రోజున మురగన్ అభిషేకం సమయంలో పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను రూ.5.09 లక్షలకు ఓ భక్తుడు సొంతం చేసుకున్నాడు.

Also Read: Indian deportees : అమెరికా నుంచి రెండో బ్యాచ్ దిగింది.. అమృత్‌సర్‌లో ల్యాండ్.. ఈసారి 119 మంది భారతీయులు వెనక్కి..!

ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులను ఆలయ నిర్వహణ, సామాజిక సేవలకు ఉపయోగిస్తామని ఆలయ పాలక వర్గం తెలియజేసింది. అయితే, ఈ స్వామివారి వద్ద ఉంచిన నిమ్మకాయను వేలంలో రూ.5.9లక్షలకు దక్కించుకున్న భక్తుడు మాట్లాడుతూ.. మురగ భగవానుడి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఇంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించి నిమ్మకాయను దక్కించుకోవటం జరిగిందని చెప్పారు.