కలియుగ శ్రీరాముడు “మోడీ” : ఉత్తరాఖండ్ సీఎం

Like Lord Ram Pm Modi Will Also Be Treated As God One Day For Good Work He Is Doing Says Uttarakhand Cm Tirath Rawat

Like Lord Ram, PM Modi ప్రధాని నరేంద్ర మోడీని శ్రీరాముడితో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్. సోమవారం హర్విద్వార్ లోని రిషికుల్ గవర్నరమెంట్ పీజీ ఆయుర్వేదిక్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన “నేత్ర కుంభ్”కార్యక్రమంలో పాల్గొన్న సీఎం..వివిధ దేశాల నేతలు ప్రధాని మోడీతో ఫొటోలు దిగేందుకు క్యూ కడుతున్నారని అన్నారు. గతానికంటే ఇది చాలా భిన్నమైనదని..గతంలో ఏ విదేశీ నేత మనదేశ ప్రధానమంత్రుల గురించి పట్టించుకునేవారు కాదన్నారు.

దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రాక మునుపు అరాచకం నడుస్తోందని.. ఇప్పుడు మన ప్రధాని, రాష్ట్రపతి ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి అధినేతలు లేచి నిలుచునే స్థాయికి చేరుకున్నాం అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రపంచంలోనే భారత్ తన శక్తియుక్తులను చాటిందన్నారు. 200 ఏళ్ల పాటు భారత్‌ను బానిసగా చేసుకున్న అమెరికా ఇప్పుడు భారత్ దారిలో నడుస్తున్నదన్నారు. ప్రధాని మోడీ కారణంగానే పరిస్థితి మారిందన్నారు. ఇది మోడీ సృష్టించిన కొత్త ఇండియా అని తీరథ్ సింగ్ పేర్కొన్నారు.

ద్వాపర యుగంలో శ్రీరాముడు సమాజ హితం కోసం పనిచేశారని, అందుకే ప్రజలు శ్రీరాముడిని భగవంతుడిగా కొలిచారని.. రాబోయే రోజుల్లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అలా నిలిచిపోతారని సీఎం అన్నారు. మోడీ చేస్తున్న మంచిపనుల కారణంగా ఆయనను కూడా దేవుడిగా కొలుస్తారని అన్నారు. ఇదిలా ఉండగా, హరిద్వార్‌‌లో జరుగుతున్న కుంభమేళాలో శానిటైజేషన్ పై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. భక్తులు తప్పని సరిగా మాస్క్ ధరించాలన్నారు. కుంభమేళాలో పాల్గొనే భక్తులు ఆర్-పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిన అవసరం లేదని సీఎం సృష్టం చేశారు. కుంభమేళాలో పాల్గొనుందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేదని తెలిపారు. మర్చి-11న ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా 2021..ఏప్రిల్-10వరకు కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో ఈసారి కుంభమేళాను 30రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు.