Lion Died With Corona: కరోనాతో సింహం మృతి.

Lion Died With Corona: కరోనాతో సింహం మృతి.

Lion Died With Corona

Updated On : June 4, 2021 / 3:54 PM IST

Lion Died With Corona: కరోనా సోకి ఓ సింహం మృతి చెందింది. తమిళనాడులోని అరిగ్ నర్ అన్నా జూపార్క్ లో ఓ మగ సింహానికి కరోనా సోకి శుక్రవారం మృతి చెందింది. ఐదు రోజుల క్రితం సింహం అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు పరీక్షించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టింగ్ నిమిత్తం శాంపిల్స్ భోపాల్ లోని ల్యాబ్ కి పంపారు. రిపోర్ట్స్ లో పాజిటివ్ గా నిర్దారణ అయింది.

అయితే సింహం మృతిపై జూ అధికారులు స్పందించారు.. దీర్ఘకాల వ్యాధులతో సింహం బాధపడుతుందని అందువల్లే మృతి చెంది ఉంటుందని తెలిపారు. ఇక ఈ సింహంతోపాటు ఉన్న మరికొన్ని సింహాలకు పరీక్షలు నిర్వహించగా వాటికి కూడా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. కాగా సింహాలకు కరోనా ఎలా సోకింది అనేది తెలియరాలేదు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు.