ISRO Chief Somanath : ఇస్రో చీఫ్ సోమనాథ్‌కి ప్రేమతో ఓ బుడ్డోడు ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా?

చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత ఇస్రో చైర్మన్‌తోపాటు శాస్త్రవేత్తల బృందం అభినందనలు అందుకుంటోంది. సోమనాథ్‌కి పొరుగింట్లో ఉండే ఓ బుడ్డోడు ప్రేమతో ఓ బహుమతి ఇచ్చాడు. అదేంటో చదవండి.

ISRO Chief Somanath

ISRO Chief Somanath : చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేసినందుకు ఇస్రో చీఫ్ సోమనాథ్, శాస్త్రవేత్తల బృందం ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా సోమనాథ్ పొరుగింట్లో ఉండే బాలుడు ప్రేమ పూర్వకమైన బహుమతి ఇచ్చాడు.

Salary of ISRO Chairman : ఇస్రో చైర్మన్ సోమనాథ్ జీతం ఎంతో తెలుసా.. అలవెన్స్‌లు అన్నీ కలిపి ఎంతంటే?
ఇస్రో చీఫ్ సోమనాథ్‌కి ఓ చిన్న పిల్లవాడు చేత్తో తయారు చేసిన విక్రమ్ ల్యాండర్ నమూనాను బహుమతిగా ఇచ్చాడు. ఆ బాలుడు ఆయన పొరుగింట్లో ఉంటాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పివి వెంకటకృష్ణన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ఇస్రో చీఫ్ శ్రీ సోమనాథ్‌ని కలవడానికి ఓ సర్ప్రైజ్ విజిటర్ వచ్చారు. పొరుగింట్లో ఉండే బాలుడు తను సొంతంగా తయారు చేసిన విక్రమ్ ల్యాండకర్ మోడల్‌ను బహుమతిగా అంతజేసాడు’ అనే శీర్షికతో పోస్ట్ చేసారు. ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది.

ISRO Team celebrations : చంద్రయాన్ 3 సక్సెస్‌తో స్టెప్పులేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ అండ్ టీం

‘ఆ అబ్బాయి ఉత్సాహాన్ని మెచ్చుకోవాలని.. ఆ పిల్లాడు కూడా భవిష్యత్‌లో సైంటిస్ట్ కావాలనుకుంటున్నాడని.. గుడ్ లక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. సోమనాథ్‌తో పాటు ఇస్రోలోని శాస్త్రవేత్తలకు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమనాథ్ ఇటీవల విమానం ఎక్కగానే ఇండిగో క్యాబిన్ సిబ్బంది నుంచి అనూహ్యమైన ఘన స్వాగతం లభించింది. ఇస్రో తాజాగా ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ఆదిత్య ఎల్‌-1ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ నుంచి ఆదిత్య ఎల్-1 విజయవంతంగా విడిపోయింది.