శానిటైజేషన్ వర్కర్లపై పూల వర్షం

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో శానిటైజేషన్ వర్కర్లు(పారిశుధ్య కార్మికులు) కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకుంటూ హర్యానాలోని అంబాలా న

శానిటైజేషన్ వర్కర్లపై పూల వర్షం

Updated On : November 17, 2021 / 11:08 AM IST

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో శానిటైజేషన్ వర్కర్లు(పారిశుధ్య కార్మికులు) కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకుంటూ హర్యానాలోని అంబాలా నగరవాసులు వారిపై పూల వర్షాన్ని కురిపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శానిటైజేషన్ వర్కర్లు కరోనాపై చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకుంటూ అంబాలాలోని నాడీ మెుహల్లా ప్రాంతానికి చెందిన స్ధానికులు వారి ఇళ్లపై నుండి పూల వర్షాన్ని కురిపిస్తూ, చప్పట్లు కొడుతూ వారి మెడలో పూలదండలను వేసి సత్కరించారు.

కరోనా పై వారు చేస్తున్న పోరాటానికి, ఇంకా వారిలో ధైర్యాన్ని పెంచటానికి గాను వారిపై పూల వర్షం కురిపించామని, దీని ద్వారా వారు ఎంతో సంతోషంగా ఉంటారని ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి దేవిందర్ శర్మ తెలిపారు. వారు మా కుటుంబం లాంటివారే, భవిష్యత్తులో ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుడు బాల్ రాజ్ మాట్లాడుతూ…ఇది చూడటానికి చాలా ఆనందంగా ఉంది. లాక్ డౌన్ సమయంలో ఎవరు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని దేశప్రజలను నేను కోరుకుంటున్నాను అని  తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తిలో భాగంగా గురుగ్రామ్ జిల్లాలోని తొమ్మిది ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది ప్రభుత్వం. గురుగ్రామ్ లోని సెక్టార్-9,సెక్టార్ -54/నిర్వా న కంట్రీ, పాలమ్ విహార్, ఎమర్ పామ్ గార్డెన్స్ సెక్టార్ -83, లాబర్నమ్ సొసైటీ, సెక్టార్ -39, విలేజ్ ఫాజిల్పూర్ జర్సా, వార్డ్ నెంబర్ 11 పటౌడి, విలేజ్ రాయ్పూర్ సోహ్నా ప్రాంతాలు containment జోన్లుగా ఉన్నాయి.