ఏప్రిల్ 17 నుంచి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఓట్ల కౌంటింగ్ జూన్ 4న

Lok Sabha Election 2024 Date: ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

ఏప్రిల్ 17 నుంచి ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఓట్ల కౌంటింగ్ జూన్ 4న

లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 17 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. ఓట్ల కౌంటింగ్ జూన్ 4న ఉంటుంది.

Lok Sabha Elections 2024


Lok Sabha Elections 2024

ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. దేశ పౌరులు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజీవ్ కుమార్ కోరారు. 2024లో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాదిని ఎన్నికల నామసంవత్సరంగా చెప్పుకోవచ్చని తెలిపారు. ప్రపంచమంతా భారత్‌లోని ఎన్నికల వైపునకు చూస్తోందని అన్నారు.

స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నెలకొన్న భారత్ లో ఎన్నికల సరళి ఎలా ఉందన్న విషయాన్ని ప్రపంచం గమనిస్తోందని రాజీవ్ కుమార్ చెప్పారు. 2024 జూన్ 16న 17వ లోక్‌సభ కాలం ముగియనుందని తెలిపారు. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ వివరించారు.

దేశంలో ఎన్నికలకు సంబంధించి.. మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.5 కోట్ల పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది, 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు ఉన్నాయని చెప్పారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని రాజీవ్ కుమార్ తెలిపారు. 85 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసుకునే సౌకర్యం కల్పించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల కలలను చిద్రం చేశాయి : ప్రధాని మోదీ