లోక్ సభ ఓట్ల లెక్కింపు.. ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ పోరు.. live Updates
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఉదయం 9.30 గంటల సమయానికి లీడింగ్ లోనే మేజిక్ ఫిగర్ దాటేసి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసే దిశగా దూసుకెళ్తోంది.

Lok Sabha Election 2024 Results : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఉదయం 9.30 గంటల సమయానికి లీడింగ్ లోనే మేజిక్ ఫిగర్ దాటేసి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసే దిశగా దూసుకెళ్తోంది.
LIVE NEWS & UPDATES
-
మోదీ స్పందన
దేశంలో ఎన్డీఏ 272 సీట్ల మెజారిటీని దాటడంతో దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఎన్డీఏపై ప్రజలు వరుసగా మూడోసారి నమ్మకాన్ని ఉంచారని అన్నారు. భారత చరిత్రలో ఇదో చరిత్రాత్మక అడుగు అని తెలిపారు.
-
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ
ఉత్తర ప్రదేశ్ మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది
ఉత్తర ప్రదేశ్ లో మొత్తం సీట్లు 80
ఎన్డీఏ 35
ఇండియా 44
ఇతరులు 1మహారాష్ట్రలో మొత్తం సీట్లు 48
ఎన్డీఏ 19
ఇండియా 28
ఇతరులు 1
-
రెండు చోట్లా రాహుల్ గాంధీ ఘన విజయం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ రెండు స్థానాల్లోంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.
-
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చందర్ పై సుమారు 3,410 ఓట్ల మెజారిటీతో డీకే అరుణ గెలుపొందారు.
-
మహబూబ్ నగర్ పార్లమెంట్ కౌంటింగ్ లో ఉత్కంఠత.
కాంగ్రెస్ , బిజెపి మధ్య గట్టి పోటీ.
చివరి రౌండ్ వరకు హోరాహోరీ.
3000 మెజారిటీతో డీకే అరుణ ముందంజ.
మిగిలిన చివరి రౌండ్ ఫలితాలు.
-
కర్ణాటక రాష్ట్రం హాసన పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి పాలయ్యారు. మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్ వంటి ఆరోపణలపై ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
-
రాహుల్ గాంధీ ఘన విజయం.
కేరళ రాష్ట్ర వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. సీపీఐ అభ్యర్ధి రాజాపై 3.5లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మరోవైపు యూపీలోని రాయ్ బరేలీలో 3.7లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో విజయం దిశగా రాహుల్ పయనిస్తున్నారు.
-
కంగనా రనౌత్ విజయం..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ మండీ నుంచి బీజేపీ నుంచి పోటీ చేసి మొదటిసారి భారీ విజయం సాధించింది.
-
ప్రధాని మోదీకి చంద్రబాబు ఫోన్..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు ఫోన్ చేసి ఎన్డీయే కూటమి విజయం దిశగా వెళ్తున్నదానిపై సంతోషం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. మోదీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించడంతో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
-
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి విజయం..
తెలంగాణ ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి విజయం సాధించారు
-
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజ..
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిజు జనతాదళ్ పార్టీల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. కాంటాబంజిలో సీఎం నవీన్ పట్నాయక్ 1158 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
అయితే ఇంకో స్థానం హింజిలిలో స్వల్ప ఆధిక్యంలో నవీన్ పట్నాయక్ కొనసాగుతున్నారు.
-
3లక్షల ఆధిక్యంతో దూసుకెళ్తున్న అమిత్ షా..
గుజరాత్ గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3లక్షల పైగా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
-
2లక్షల ఓట్ల ఆధిక్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్..
మధ్యప్రదేశ్‌లోని విదిశలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 2 లక్షల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.
-
రెండు చోట్ల రాహుల్ గాంధీ ఆధిక్యం
-
హాసనలో ఇటీవల అరెస్ట్ అయిన ప్రజ్వల్ రేవణ్ణ ఆధిక్యం..
కర్ణాటకలోని హాసనలో జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆధిక్యంలో ఉన్నారు. ఇటీవల మహిళలపై లైంగిక దాడి, కిడ్నాప్ ఆరోపణలతో ప్రజ్వల్ అరెస్టయ్యారు.
-
అమేథీలో స్మృతి ఇరానీ వెనుకంజ
అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు.
-
ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ కు హెవీ ట్రాఫిక్..
ఎన్నికల రిజల్ట్స్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ ను సెకన్ కు 2 లక్షల మంది చూస్తున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.
-
వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ..
వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ లీడింగ్ లో ఉన్నారు.
-
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు.. ఎవెరెవరు ఆధిక్యంలో కొనసాగుతున్నారంటే?
వరంగల్ లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఆధిక్యంలో ఉన్నారు.
మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు.
ఖమ్మం లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
హైదరాబాద్ లో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యంలో ఉన్నారు.
సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు.
ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ ఆధిక్యంలో ఉన్నారు.
కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు.
నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యంలో ఉన్నారు.
చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
-
రాజమండ్రిలో పురంధేశ్వరి ఆధిక్యం
-
లీడింగ్స్ లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ..
ఎన్డీఏ లీడింగ్స్ లో దేశవ్యాప్తంగా మ్యాజిక్ ఫిగర్ దాటేసింది.
-
కేంద్రమంత్రులు ముందంజ..
గుజరాత్ గాంధీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు 7311 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్ హమీర్‌పుర్ స్థానంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ 6492 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
-
రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ ముందంజ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో, యూపీలోని రాయ్‌బరేలీలో రాహుల్ ఆధిక్యం
-
కేరళలో బీజేపీ వెనుకంజ..
కేరళ తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెనుకంజ
కేరళ త్రిశ్శూర్‌లో బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి వెనుకంజ
-
లోక్ సభ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ..
వారణాసిలో ముందంజలో ప్రధాని మోదీ
గాంధీ నగర్ లో ముందంజలో అమిత్ షా
న్యూ ఢిల్లీలో ముందంజలో బాన్సురి స్వరాజ్
అమేథీలో ముందజలో స్మృతి ఇరానీ
లక్నో లో ముందంజలో రాజ్ నాథ్ సింగ్
మధురలో ముందంజలో హేమామలిని
-
తమిళనాడులో బీజేపీ వెనుకంజ..
తమిళనాడు కోయంబత్తూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అన్నామలై వెనుకంజలో ఉన్నారు.
చెన్నై సౌత్‌లో తమిళిసై సౌందరరాజన్ వెనుకంజలో ఉన్నారు.
-
రాజమండ్రి, అనకాపల్లిలో బీజేపీ ముందంజ..
పోస్టల్ బ్యాలెట్స్ లో రాజమండ్రిలో పురంధేశ్వరి, అనకాపల్లిలో సీఎం రమేష్ ఆధిక్యం
-
నటి కంగనా రనౌత్, నటుడు రవికిషన్ ఆధిక్యం..
పోస్టల్ బ్యాలెట్స్ లో హిమాచల్‌ప్రదేశ్ మండిలో కంగనా రనౌత్.. యూపీ గోరఖ్‌పూర్‌లో రవికిషన్ ఆధిక్యం
-
మహబూబ్ నగర్ లో బీజేపీ ముందంజ..
మహబూబ్ నగర్ పోస్టల్ బ్యాలెట్ లో 410 ఓట్లతో బీజేపీ DK అరుణ లీడ్
-
బీజేపీ ముందంజ..
ఆదిలాబాద్, కరీంనగర్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్స్ లో బీజేపీ ముందంజలో ఉంది.
-
నిజామాబాద్ కౌంటింగ్ సెంటర్ లో అపశ్రుతి..
నిజామాబాద్ కౌంటింగ్ సెంటర్ లో కౌంటింగ్ సూపర్ వైజర్ అస్వస్థతకు గురయ్యారు. కళ్ళుతిరిగి పడిపోవడంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు
-
వారణాసిలో ప్రధాని మోదీ, గాంధీనగర్ లో అమిత్ షా ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వారణాసిలో ప్రధాని మోదీ, గాంధీనగర్ లో అమిత్ షా ఆధిక్యం
-
చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు..
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం..
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
-
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసిన అధికారులు..
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్స్ ను అధికారులు ఓపెన్ చేశారు. కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవనుంది.
-
10టీవీతో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..
10టీవీతో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ సీట్ గెలిచి గిఫ్ట్ గా ఇస్తాను. మల్కాజిగిరి కార్యకర్తలు అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. నాకు సహకరించిన పార్టీ శ్రేణులకు, నాయకులకు కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు గెలుస్తుంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి అని తెలిపింది.
-
మీడియాతో మాట్లాడిన హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత
-
చెన్నైలో మీడియాతో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి, మాజీ గవర్నర్ తమిళిసై
-
తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ వివరాలు..
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలతో పోటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 34 లొకేషన్లలో 44 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఉదయం 8.30కి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల్లో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 139 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాల కంపెనీలతో భద్రత ఏర్పాటు చేశారు. సరాసరిగా 18–20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కోసం 14 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంది. లోక్ సభ ఎన్నికల మొదటి ఫలితం ఉదయం 11-12 గంటల మధ్య రానుంది. చొప్పదండి, యాకుత్‌పురా, దేవరకొండ లో అత్యధికంగా 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు, ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మొత్తం తెలంగాణ లోక్ సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీ చేశారు.