Congress Second List : 43 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Lok Sabha Elections 2024 : కాంగ్రెస్ రెండో జాబితాలోని 43 మంది అభ్యర్థుల్లో 10 మంది జనరల్ అభ్యర్థులు, 13 మంది ఓబీసీ అభ్యర్థులు, 10 మంది ఎస్సీ అభ్యర్థులు, 9 మంది ఎస్టీ అభ్యర్థులు, ఒక ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.

Congress Second List : 43 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Congress

Updated On : March 12, 2024 / 7:00 PM IST

Lok Sabha Elections 2024 : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం (మార్చి 12న) 43 మందితో కూడిన రెండో జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విడుదల చేశారు.

సోమవారం సీఈసీ సమావేశం కాగా.. అసోం , మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి దాదాపు 43 పేర్ల జాబితాను క్లియర్ చేసిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మార్చి 8న పార్టీ 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read Also : Governor Quota MLCs : మళ్లీ వారిద్దరే..! గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం

కాంగ్రెస్ రెండో జాబితాలోని 43 మంది అభ్యర్థుల్లో 10 మంది జనరల్ అభ్యర్థులు, 13 మంది ఓబీసీ అభ్యర్థులు, 10 మంది ఎస్సీ అభ్యర్థులు, 9 మంది ఎస్టీ అభ్యర్థులు, ఒక ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. అందులో అసోం (12), గుజరాత్ (7), మధ్యప్రదేశ్ (10), రాజస్థాన్(10), ఉత్తరాఖండ్(3), డమన్ అండ్ డయ్యు (1) అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 82 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.

పేదల కోసమే కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ : 
ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పేదల కోసం కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. పేదలు, యువకులు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోరాడుతుందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీది ప్రజల అజెండా గా పేర్కొన్న ఆయన తాము అధికారంలోకి వస్తే పేద ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తామని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. యువకులు, సామాజిక న్యాయం దిశగానే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉందని చెప్పారు. 2024 ఎన్నికలు ధనికులు పేదలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నుంచి పోటీ చేయనున్నారు. కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నుంచి పోటీ చేయనున్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌ బరిలో నిలిచారు. గతంలో మాదిరిగా సచిన్ పైలట్ పేరు రెండో జాబితాలో లేదు. ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రాహుల్ కస్వా రాజస్థాన్‌లోని చురు నుంచి పోటీ చేయనున్నారు.

Read Also : Telangana Cabinet Decisions : త్వరలో కొత్త రేషన్ కార్డులు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు