ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్ సభ వాయిదా పడింది. వచ్చే సోమవారానికి లోక్ సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. 2019-20 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పియూష్ గోయల్..ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాదని దేశ ప్రగతి యాత్రకు దర్పణమని అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్నవేళ బడ్జెట్ ద్వారా రైతులకు మోడీ సర్కార్ వరాలు కురిపించింది. ఉద్యోగులు, పింఛన్ దారులకు కూడా బడ్జెట్ ద్వారా భారీ ఊరట లభించింది. గోయల్ బడ్జెట్ చదువుతున్న సమయంలో మిగిలిన బీజేపీ సభ్యుల్లానే ప్రదాని మోడీ కూడా లోక్ సభలో చాలా ఉత్సాహంగా కన్పించారు. పదే పదే బల్లను చరుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.