ఇంట్లో గ్యాస్ లీక్, పేలుడు లైవ్ వీడియో.. వాళ్లిద్దరూ లక్కీగా తప్పించుకున్నారు..

ముంబయిలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటుచేసుకుంది. పెద్ద ప్రమాదం నుంచి మహిళ, మరో వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు.

LPG cylinder blasted

LPG Cylinder Massive Blast: ముంబయిలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటుచేసుకుంది. పెద్ద ప్రమాదం నుంచి మహిళ, మరో వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలీండ్ లీక్ కారణంగా ఇంట్లో పేలుడు సంభవించింది. అయితే, ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అదృష్టంశాత్తూ మహిళ, మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Paneer Quality Check: మీరు ఇంట్లో తింటున్న పనీర్ అసలైనదేనా? నకిలీదా? చిటికెలో ఇలా చెక్ చేయండి

వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం.. జూన్ 18న మధ్యాహ్నం 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అర్ధమవుతుంది. ఇంట్లో ఓ మహిళ గ్యాస్‌స్టౌవ్‌కు సిలిండర్ బిగించేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ పైప్ ఊడిపోయింది. పైపు నుంచి గ్యాస్ ఎగజిమ్మడంతో సిలిండర్ ను వంటగది నుంచి బయటకు తీసుకొచ్చిన మహిళ హాల్‌లో పడేసింది. పైపు నుంచి గ్యాస్ లీకవుతుండటంతో.. ఇళ్లంతా వ్యాపించింది. భయంతో మహిళ అక్కడి నుంచి ఇంటి బయటకు పరుగు తీసింది.

కొన్ని క్షణాలకు గ్యాస్ రావడం ఆగిపోవడంతో.. మహిళ మళ్లీ ఇంట్లోకి వచ్చింది. ఆమెతోపాటు మరో వ్యక్తి వచ్చాడు. అతని సహాయంతో సిలిండర్ ను అక్కడి నుంచి తీయడానికి ప్రయత్నించింది. అంతలోనే క్షణాల్లో పెద్దెత్తున పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న మహిళ, మరో వ్యక్తి తెరిచిన తలుపు వైపు నుంచి వేగంగా బయటకు పరుగెత్తారు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి.. ‘అదృష్టవశాత్తూ ఆ ఇంటికి ఉన్న రెండు తలుపులు, కిటికీలు తెరిచి ఉండడంతో లీకైన గ్యాస్ బయటకు వెళ్లడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.’’ అని పేర్కొన్నారు.