Maharashtra : పూణే పింప్రీ చించ్‌వాద్‌లో పేలిన ఎల్పీజీ సిలిండర్లు…బస్సులు దగ్ధం

LPG cylinders explode

Maharashtra : మహారాష్ట్రలోని పూణే పింప్రీ చించ్‌వాద్‌లో ఎల్పీజీ సిలిండర్లు పేలి ఘోర ప్రమాదం జరిగింది. పూణే నగరంలోని పింప్రి చించ్‌వాడ్ తథవాడే ప్రాంతంలో ఆదివారం రాత్రి పలు ఎల్‌పిజి సిలిండర్లు పేలడంతో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పేలుడు స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేసిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ట్యాంకర్‌ నుంచి సిలిండర్లలోకి ఎల్‌పీజీని అక్రమంగా నింపుతున్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Also Read : Hamas Attack On Israel : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఎఫెక్ట్…పెరిగిన ముడి చమురు ధరలు

పేలుడు ధాటికి సమీపంలోని కళాశాలకు చెందిన రెండు బస్సులు కూడా అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటన రాత్రి 10:30 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు నుంచి ఐదు ఎల్‌పిజి సిలిండర్లు పేలినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఎల్‌పిజి ఉన్న ట్యాంకర్ మాత్రం పేలలేదని అగ్నిమాపకశాఖ అధికారి చెప్పారు.

Also Read : Afghanistan earthquakes : అఫ్ఘానిస్థాన్‌లో ఎటు చూసినా శవాల గుట్టలే…2,445కు చేరిన మృతుల సంఖ్య

అగ్నిమాపక వాహనాలు, నీటి ట్యాంకర్‌లను వెంటనే సంఘటనా స్థలానికి పంపించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చామని పింప్రి చించ్‌వాడ్ అగ్నిమాపక విభాగానికి చెందిన అధికారి చెప్పారు. పెద్ద శబ్దంతో పేలుళ్లు రావడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆయన తెలిపారు.

Also Read : Odisha Train Tragedy : ఒడిశా రైలు ప్రమాదంలో 28 గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు