Hamas Attack On Israel : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఎఫెక్ట్…పెరిగిన ముడి చమురు ధరలు
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత చమురు ధరలు సోమవారం నాలుగు శాతానికి పైగా పెరిగాయి...

Hamas Attack On Israel
Hamas Attack On Israel : ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత చమురు ధరలు సోమవారం నాలుగు శాతానికి పైగా పెరిగాయి. ముడిచమురు అధికంగా ఉన్న ప్రాంతం నుంచి సరఫరా చేయడంపై గురించి ఆందోళనలు తలెత్తాయి.
Also Read : Israel : ఇజ్రాయెల్ మ్యూజిక్ ఫెస్టివల్ సైట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడి, 260 మృతదేహాలు లభ్యం
హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి, దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటన చేయడం వల్ల 1,000 మందికి పైగా మరణించారు. ఈ యుద్ధం వల్ల యునైటెడ్ స్టేట్స్, ఇరాన్‌లలో వివాదాలు విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ సంఘర్షణ ఇతర ప్రాంతాలకు ప్రత్యేకించి సౌదీ అరేబియాకు వ్యాప్తి చెందుతుందా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
Also Read :Afghanistan earthquakes : అఫ్ఘానిస్థాన్‌లో ఎటు చూసినా శవాల గుట్టలే…2,445కు చేరిన మృతుల సంఖ్య
రష్యా, సౌదీ అరేబియా ఆయిల్ ఉత్పత్తి కోతలు, సరఫరా ఆందోళనల కారణంగా చమురు ధరలు ఇప్పటికే పెరిగాయి. హమాస్ దాడి, ఇజ్రాయెల్ యుధ్ధం నేపథ్యంలో ప్రపంచ ద్రవ్యోల్బణం గురించి తాజా ఆందోళనలకు ఆజ్యం పోసినట్లు అవడంతో ఈ సంక్షోభం వచ్చింది.