Gas Cylinder Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే..

వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది. 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.58.50 తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.

Commercial LPG cylinder

Gas Cylinder Price: వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట లభించింది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఇవాళ (జులై 1వ తేదీ) కూడా గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

Also Read: Indian Railways: రైల్వే ఛార్జీలు పెరిగాయ్.. కొత్త ఛార్జీలు ఎంతంటే..? హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాస్‌లో పెరిగిన ఛార్జీలు ఇలా..

వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర తగ్గింది. 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.58.50 తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఇదిలాఉంటే.. గృహ అవసరాలకోసం వినియోగించే 14 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణలో 14కేజీల సిలిండర్ ధర 855గా ఉంది. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.


దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో ధరలు ఇలా..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,665 వద్దకు చేరింది. నిన్నటి వరకు రూ.1723.50గా ఉండగా.. ఇవాళ రూ.58.50 తగ్గడంతో రూ.1665కు చేరింది.
♦ కోల్‌కతాలో రూ. 1,769.
♦ ముంబైలో రూ.1,616.
♦ చెన్నైలో రూ.1,823.50
♦ హైదరాబాద్‌లో రూ.1,886.50.
♦ విజయవాడలో రూ. 1,823.
♦ విశాఖపట్టణంలో 1,718.
♦ బెంగళూరులో 1,738.