Madhya Pradesh Secretariat Fire Accident
Madhya Pradesh Secretariat Fire Accident: మధ్యప్రదేశ్ సచివాలయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పొగలు దట్టంగా అలముకున్నాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి. సచివాలయంలో ఎవరైనా చిక్కుకున్నారా, లేరా అనే వివరాలు వెల్లడి కాలేదు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు ఫైరింజన్లతో సంఘటనా చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
Also Read: అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ.. వీడియో వైరల్