CM Mohan Yadav: బీజేపీ బిగ్ టార్గెట్! మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ఎంపికకు మూడు కారణాలు.. అవేమిటంటే?

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోహన్ యాదవ్ కు సీఎం పదవి అప్పగించడానికి మూడు కారణాలు ఉన్నట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మోహన్ యాదవ్ కరుడు కట్టిన హిందుత్వ వాదితోపాటు

Madhya Pradesh New CM Mohan Yadav

Madhya Pradesh CM Mohan Yadav : మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర నూతన సీఎంగా మోహన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. నాలుగు సార్లు సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ తరువాత మోహన్ యాదవ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం అభ్యర్థుల జాబితాలో తొలుత మోహన్ యాదవ్ పేరు లేదు. కానీ, అనూహ్య రీతిలో ఆయన పేరు తెరపైకి రావడం, బీజేపీ అధిష్టానంసైతం మోహన్ యాదవ్ సీఎంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కీలక నేతలను కాదని మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మోహన్ యాదవ్ కు సీఎం పదవి అప్పగించడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం బిగ్ టార్గెట్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Also Read : CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లక్షలాది మంది రైతు కుటుంబాలకు శుభవార్త

మోహన్ యాదవ్ కరుడుగట్టిన హిందుత్వ వాది. విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగారు. కళాశాలల్లో రామచరిత మానస్ ను ఆప్షనల్ సబ్జెక్టు గా ప్రవేశపెడతామని 2021లో ఆయన ప్రకటించారు. మోహన్ యాదవ్ 1965 మార్చి 25న ఉజ్జయినిలో జన్మించారు. ఎల్ ఎల్ బీ, ఎంబీఏతో పాటు పీహెచ్ డీ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. 58ఏళ్ల యాదవ్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2013లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2018లో, తాజాగా జరిగిన 2023 ఎన్నికల్లోనూ ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. 2020లో మొదటిసారిగా మంత్రి అయ్యారు. ఉజ్జయిని ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి నాయకుడు మోహన్ యాదవ్.

Also Read : CM Jagan : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు

ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోహన్ యాదవ్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. దీంతో మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోహన్ యాదవ్ కు సీఎం పదవి అప్పగించడానికి మూడు కారణాలు ఉన్నట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మోహన్ యాదవ్ కరుడు కట్టిన హిందుత్వ వాదితోపాటు రాష్ట్రీ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో మొదటి నుంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. దీనికితోడు రాష్ట్రంలో 48శాతం జనాభా ఉన్న ఓబీసీ నేత కావడంతో మోహన్ యాదవ్ కు బీజేపీ పెద్దలు పెద్దపీట వేశారు.

 

మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనికూడా బీజేపీ పెద్దలు మోహన్ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. యాదవ్ భార్య ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి. మోహన్ యాదవ్ ను సీఎంగా చేస్తే ఆ ప్రభావం అక్కడ కూడా ఉంటుందని బీజేపీ పెద్దలు భావించినట్లు తెలుస్తోంది. మోహన్ యాదవ్ మామయ్య యూపీలోని సుల్తాన్ పూర్ లో నివసిస్తున్నారు. మోహన్ యాదవ్ ఎంపికతో యాదవ్ ఓట్ల మీద ఆధారపడి రాజకీయం చేసే యూపీలో సమాజ్ వాదీ పార్టీ, బీహార్ లో ఆర్జేడీని లోక్ సభ ఎన్నికల్లో దెబ్బకొట్టొచ్చని బీజేపీ పెద్దలు అంచనా వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి యూపీ, బీహార్ రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ను బీజేపీ పెద్దలు ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి బీజేపీ పెద్దల స్కెచ్ ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనేది లోక్ సభ ఎన్నికల తరువాత తేలనుంది.