సర్కార్ ఆస్పత్రిలో ఇంతే!: కింద వరదనీరు..మంచంపైన పేషెంట్లు

  • Published By: venkaiahnaidu ,Published On : September 13, 2019 / 08:02 AM IST
సర్కార్ ఆస్పత్రిలో ఇంతే!: కింద వరదనీరు..మంచంపైన పేషెంట్లు

Updated On : September 13, 2019 / 8:02 AM IST

మధ్యప్రదేశ్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. అయితే పలు చోట్ల ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లాయి. అయితే ఇప్పుడు ఇండోర్ లోని మహారాజ యశ్వంత్రో హాస్పిటల్ లోపలికి వరద నీరు వచ్చేసింది. హాస్పిటల్స్ లోపలి రూమ్ లలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఓ వైపు మంచంపై పేషెంట్లు పడుకొని ఉండగా కింద మొత్తం నీటితో నిండిపోయింది.హాస్పిటల్ మొత్తం వరద నీటిలో మునిగింది.

రాజధాని భోపాల్ లో కురుస్తున్న వర్షానికి రోడ్లన్ని పూర్తిగా జలమయమయ్యాయి. మోకాల లోతు వరకు నీళ్లు చేరటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటు బేతుల్ జిల్లాలో భీమ్ పూర్ లో నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాలు నీట మునిగాయి.