Madhya Pradesh : తనపై అత్యాచారం చేశాడు…ఎమ్మెల్యే కొడుకుపై ఆరోపణలు
వివాహం సాకుతో..కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు తనపై అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ మహిళ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది

Madhya Pradesh Woman
Congress MLA’s son of rape : వివాహం సాకుతో..కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు తనపై అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ మహిళ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Murli Morwal ఉజ్జయని బద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మల్యే. ఇతని కుమారుడు కరన్ మొర్వాలి ఉజ్జయని కాంగ్రెస్ యువ నాయకుడుగా ఉన్నారు. కాంగ్రెస్ యువజన కార్యకర్తగా తాను పనిచేయడం జరుగుతోందని, గత సంవత్సరం డిసెంబర్ లో కరణ్ ను కలిసినట్లు బాధితురాలు వెల్లడించింది.
తనను వివాహం చేసుకుంటానని కరణ్ చెప్పాడని, Bhawarkuan పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ కు తీసుకెళ్లి..పలు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అతను హెచ్చరించాడని వెల్లడించింది. 2021, ఏప్రిల్ 03వ తేదీ తమకు ఫిర్యాదు చేయడం జరిగిందని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జి జ్యోతి శర్మ తెలిపారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ముర్లి మోర్వాల్ కొడుకు కరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు.