హిజ్రాలను ఏ జైల్లో ఉంచాలి..? : పోలీసుల ధర్మ సందేహం తీర్చిన కోర్టు
నేరం చేసిన వారిని జైల్లో ఉంచుతారని అందరికి తెలుసు. పురుషులైతే మగవాళ్ల జైల్లో.. మహిళలైతే స్త్రీల జైల్లో ఉంచుతారు. ఇద్దరికి వేర్వేరు కారాగారాలు ఉన్నాయి. ఇక 18 ఏళ్లు

నేరం చేసిన వారిని జైల్లో ఉంచుతారని అందరికి తెలుసు. పురుషులైతే మగవాళ్ల జైల్లో.. మహిళలైతే స్త్రీల జైల్లో ఉంచుతారు. ఇద్దరికి వేర్వేరు కారాగారాలు ఉన్నాయి. ఇక 18 ఏళ్లు
నేరం చేసిన వారిని జైల్లో ఉంచుతారని అందరికి తెలుసు. పురుషులైతే మగవాళ్ల జైల్లో.. మహిళలైతే స్త్రీల జైల్లో ఉంచుతారు. ఇద్దరికి వేర్వేరు కారాగారాలు ఉన్నాయి. ఇక 18 ఏళ్లు నిండని వారినైతే బోస్టల్ స్కూల్ లో వేస్తారు. ఇదంతా ఓకే.. మరి.. అటు ఇటు కాని.. థర్డ్ జెండర్ (హిజ్రా) ల పరిస్థితి ఏంటి? నేరం కేసుల్లో అరెస్ట్ చేసిన హిజ్రాలను ఏ జైల్లో ఉంచాలి? పురుషుల జైల్లో ఉంచాలా? లేక మహిళల జైల్లో పెట్టాలా? తమిళనాడు పోలీసులకు ఈ ధర్మ సందేహం వచ్చింది. దీంతో వారు తలలు పట్టుకున్నారు.
హిజ్రాలను ఎక్కడ నిర్బంధించాలని అనే అంశంపై మద్రాస్ హైకోర్టు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే.. ఏదైనా నేరం చేసి హిజ్రాలు అరెస్ట్ అయితే ముందుగా వారికి జిల్లా వైద్యాధికారులతో పరీక్షలు చేయించాలని తెలిపింది. ఈ వైద్య పరీక్షల్లో వచ్చిన రిపోర్టు ప్రకారం వారిలో మగ లక్షణాలు ఎక్కువగా ఉంటే పురుషుల జైల్లో, ఆడ లక్షణాలు ఎక్కువగా ఉంటే మహిళల జైల్లో నిర్బంధించవచ్చని హైకోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక వేళ అలాంటి పరిస్థితి ఎదురైతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని తెలిపింది.
తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్ కోర్టులకు హైకోర్టు కొత్త నింబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో విడుదల చేసింది. అక్కడి కోర్టుకు వచ్చిన ఓ కేసు విచారణ నిమిత్తం హైకోర్టు కింది కోర్టులకు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టు విధించిన నూతన నిబంధనల ప్రకారం అరెస్ట్ అయిన వారిని నేరుగా హాజరుపరిస్తే మాత్రమే వారిని జైల్లో నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపింది.
Also Read : విశాఖ టూర్‌తో జగన్ మౌనం.. సీఎం మదిలో ఏముంది?