Earthquake in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Earthquake in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Updated On : October 3, 2023 / 3:36 PM IST

Earthquake in Delhi NCR: ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 2:53 గంటలకు భూకంపం సంభవించిన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కూడా భూకంపం సంభవించింది. వాస్తవానికి భూకంప కేంద్రం నేపాల్‌లో ఉంది. దీని లోతు భూమి ఉపరితలం నుండి 5 కి.మీ.

ఇక ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్‌లో భూకంపం వస్తుందని నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్త సోమవారం అంచనా వేయడం గమనార్హం. అయితే భారతదేశంలో ప్రకంపనలు కనిపించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భూకంప కోణం నుంచి చాలా సున్నితంగా ఉండే జోన్-5లో ఢిల్లీ ఉంటుంది. భూకంపం రావడంతో ఇళ్ల నుంచి భయంతో బయటకు వచ్చారు. సౌత్ ఢిల్లీలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థి క్లాస్ బ్లాక్ బోర్డ్ పగిలిపోయిందని చెప్పాడు.

తనకు గట్టి షాక్ తగిలిందని మరో విద్యార్థి చెప్పాడు. జనమంతా బయటకు వచ్చారు. ఢిల్లీలో కూడా బలమైన భూకంపం వచ్చినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలంతా క్షేమంగా ఉన్నారని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.