Maharashtra Politics: షిండే సర్కార్ 6 నెలల్లో కూలిపోవటం..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం : శరద్​ పవార్

బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఎంతోకాలం అధికారంలో ఉండరు..ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది ..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం’’ అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Maharashtra Politics : ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య మహా వికాస్ అఘాడి కూటమిగా ఏర్పడిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ సహాయంతో సీఎం పీఠాన్ని ఎక్కారు ఏక్ నాథ్ షిండే. ఏకులా వచ్చి మేకులా తయారై ఆటో డ్రైవర్ స్థాయినుంచి శివసేన రెబెల్ గా మారి సీఎం అయ్యారు షిండే. ఇలా సీఎం అయ్యారో లేదో అలా శివసేనకు మద్దతు ఇచ్చిన ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ కు ఐటీ నోటీసులు జారీ చేయించారు. ఈ విషయాన్ని తాను ముందే ఊహించానని కాబట్టి తానేమీ ఆందోళన చెందటంలేదని ప్రకటించిన శరత్ పవార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఎంతోకాలం అధికారంలో ఉండరు..ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది ..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం’’ అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

Also read :  Maharashtra: బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే విజయం

2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ..బీజేపీకి అధికారం దక్కకూడదనే వ్యూహంతో ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి మహా వికాస్ అఘాడి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ..కానీ అవకాశం కోసం కాచుకని కూర్చున్న బీజేపీ అదను చూసి దెబ్బకొట్టింది. మహా వికాస్ అఘాడీ కూటమిని చీల్చింది. దీంట్లో భాగంగానే శివసేన నేత ఏక్ నాథ్ షిండే ద్వారా పావులు కదిపి ఎట్టకేలకు ప్రభుత్వాన్ని కూలగొట్టి షిండేను సీఎంను..మాజీ సీఎం ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎంను చేసింది. అనంతరం ప్రత్యర్ధులపై ఐటీ నోటీసులు ద్వారా విరుచుకుపడుతే ఎన్సీపీ అధినేత శరత్ పవార్ కు ఐటీ నోటీసులు జారీ చేసింది.

ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ముంబైలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో శరత్ పవార్ మాట్లాడుతూ.. షిండే ప్రభుత్వం కూలిపోతుంది అంటూ జోస్యం చెప్పారు. ఇప్పుడు బీజేపీతో కలిసి షిండే ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం కూడా రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో ఈ కూటమి పతనం అవుతుందని..మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని అన్నారు పవార్. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేతగా పవార్ చేసిన ఈ వ్యాఖ్యలపై కలకలం రేగుతోంది మహారాష్ట్రలో.

Maharashtra: మ‌హారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీక‌ర్ నిర్ణ‌యంపై సుప్రీంకోర్టుకు శివ‌సేన‌

ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని పవార్ ఈ సందర్భంగా అన్నారు. ఒకసారి మంత్రి వర్గాన్ని ప్రకటించి శాఖలు కేటాయిస్తే వారి అశాంతి బయటపడుతుందని..అదికాస్త చివరికి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది పవార్ అన్నారు. బీజేపీతో జట్టు కట్టి చేసిన తమ ‘ప్రయోగం’ విఫలమైన తర్వాత అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈక్రమంలో తమకు ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నదని ఎన్సీపీ ఎమ్మెల్యేకలు తెలిపారు పవార్. కాబట్టి నేతలు అంతా మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని..నేతలంతా తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాలల్లోనే ప్రజల మధ్యే సమయం గడపాలని పవాన్ సూచించారు.

Also read : Maharashtra political crisis : పతనం అంచున ఉద్ధవ్ ప్రభుత్వం..‘మహా’ రాజకీయాల భీష్మాచార్యుడు శరద్ పవార్ తక్షణ కర్తవ్యం ఏంటీ?

కాగా..మరోవైపు సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి బలపరీక్ష జరగనుంది. విశ్వాస పరీక్షకు ముందు బీజేపీ నేత రాహుల్ నార్వేకర్ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అనంతరం శివసేన శాసనసభా పక్ష నేతగా షిండేను స్పీకర్ తిరిగి నియమించి ఉద్ధవ్ థాకరే వర్గానికి షాకిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు