Maharashtra: మ‌హారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీక‌ర్ నిర్ణ‌యంపై సుప్రీంకోర్టుకు శివ‌సేన‌

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే వ‌ర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ మ‌ద్ద‌తుతో అసెంబ్లీ స్పీక‌ర్‌గా న‌ర్వేక‌ర్ ఎన్నిక‌య్యాక తీసుకున్న నిర్ణ‌యాలపై శివ‌సేన సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

Maharashtra: మ‌హారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీక‌ర్ నిర్ణ‌యంపై సుప్రీంకోర్టుకు శివ‌సేన‌

Supreme Court

Maharashtra: మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే వ‌ర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ మ‌ద్ద‌తుతో అసెంబ్లీ స్పీక‌ర్‌గా న‌ర్వేక‌ర్ ఎన్నిక‌య్యాక తీసుకున్న నిర్ణ‌యాలపై శివ‌సేన సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వ‌ర్గంలోని భరత్ గొగవాలేను శివసేన విప్‌గా గుర్తిస్తూ స్పీక‌ర్ నిర్ణయం తీసుకున్న విష‌యంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన‌ శివసేన వర్గం అభ్యంత‌రాలు తెలిపింది.

Modi: కాసేప‌ట్లో ఏపీకి ప్ర‌ధాని మోదీ.. ప్రధానితో క‌లిసి అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో పాల్గొననున్న జగన్

కొత్తగా నియమితుడైన స్పీకర్‌కు విప్‌లను గుర్తించే అధికారం లేదని పేర్కొంది. ఇప్పటికే మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ చర్యలపై కేసు సుప్రీంకోర్టులో ఉంద‌ని సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి అన్నారు. ఉద్ధ‌వ్ ఠాక్రేకు చెందిన శివ‌సేన వ‌ర్గం వేసిన పిటిష‌న్‌పై జూలై 11న సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది. కాగా, మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.