Maharashtra: సీఎం ఫడ్నవీస్ వద్దే హోంశాఖ.. షిండే, అజిత్ పవార్ శాఖలేమిటంటే?
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కూటమి నుంచి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ..

Maharashtra cabinet
Maharashtra cabinet minister portfolio allocation: మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కూటమి నుంచి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లతోపాటు మొత్తం 39 మంది ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, గత కొద్దిరోజులుగా శాఖల కేటాయింపుపై వీరి మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. హోంశాఖను షిండేకు కేటాయించాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తూ వచ్చింది. కానీ, హోంశాఖను ఫడ్నవీస్ తనవద్దే ఉంచుకున్నారు. శనివారం రాత్రి మంత్రివర్గ సభ్యులకు పోర్ట్ పోలియోలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హోంశాఖ, లా అండ్ జస్టిస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, ప్రజా పనుల విభాగం శాఖలు కేటాయించగా.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఆర్థిక శాఖతోపాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖలు కేటాయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి చంద్రశేఖర్ బావన్ కులే (రెవెన్యూ శాఖ), రాధాకృష్ణ (జలవనరులు – గోదావరి,కృష్ణ లోయ అభివృద్ధి కార్పొరేషన్), హసన్ మియాలాల్ (వైద్య విద్య), చంద్రకాంత్ సరస్వతి (ఉన్నత, సాంకేతిక విద్య, శాసనసభ వ్యవహారాలు), గిరీశ్ గీతా దత్తాత్రేయ మహాజన్ (జలవనరులు -విదర్భ, తాపీ, కొంకణ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, విపత్తు నిర్వహణ). గణేశ్ సుభద్ర రామచంద్ర నాయక్ (ఫారెస్ట్) ఇలా మంత్రులందరికీ శాఖలను కేటాయించారు.