ముంబైలో కరెంట్ పోయింది

ముంబైలో కరెంట్ పోయింది

Updated On : October 12, 2020 / 11:05 AM IST

Mumbaiలోని పవర్ గ్రిడ్‌లో టెక్నికల్ మిస్టేక్ కారణంగా పవర్ కట్ ఏర్పడింది. సిటీ ఎలక్ట్రిక్ సప్లై బోర్డు కథనం ప్రకారం.. ‘టాటాకు చెందిన ఇన్‌కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ కారణంగానే ఈ అంతరాయం ఏర్పడింది.

దీనిపై మెట్రో సిటీ అధికార సిబ్బంది ఇలా ట్వీట్ చేశారు. టాటా ఇన్కమింగ్ ఎలక్ట్రిక్ సప్లై ఫెయిల్యూర్ కావడంతో ఎలక్ట్రిక్ సప్లై నిలిచిపోయిందంటూ పోస్టు చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.



Mumbaiలో ఏం జరుగుతుంది.. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రిసిటీ కట్ అయిందా.. అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ప్రతి ఒక్కరి ఎలక్ట్రిసిటీ కట్ అయిపోయింది. సడెన్ గా జరిగిన దానిని ఎవ్వరూ పట్టించుకోరా.. ఇది సిటీ వైడ్ పవర్ కట్.. ఆ.. అంటూ ట్వీట్ చేస్తున్నారు.